Giant Python Viral Video: వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో గానీ.. ఇలా ఇరుక్కుపోయింది..?

వేదిక ప్రకారం, ఈ కొండచిలువలు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కనిపించే అతిపెద్ద పాము జాతులలో ఒకటి. వీడియోను పంచుకున్న IFS అధికారి క్యాప్షన్‌లో ఇలా రాశారు..హ్యాపీగా పీకలదాకా తిన్న తర్వాత ఈ కొండచిలువ ట్రాప్‌లో చిక్కుకుందని రాశారు. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.

Giant Python Viral Video: వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో గానీ.. ఇలా ఇరుక్కుపోయింది..?
Representative Image
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 29, 2024 | 8:22 PM

Giant Python Viral Video: ప్రతిరోజూ సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలను చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఒక పెద్ద కొండచిలువ వీడియో వేగంగా వైరల్‌ అయి ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో ఒక గ్రామంలోకి వచ్చిన ఒక పెద్ద కొండచిలువను చూసి ప్రజలు షాక్ అయ్యారు. అదే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఒక పెద్ద కొండచిలువ కనిపించింది. అది ఏదో భారీ మింగేసినట్టుగా కనిపిస్తుంది. దానిని మింగిన తర్వాత జీర్ణించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది. దాంతో పాటు కొండచిలువ నోటిలో అది మింగేసిన పశువును కట్టేసిన తాడు కనిపించింది.. ఈ షాకింగ్ వీడియోను @AMAZlNGNATURE అనే పేరు గల X ఖాతా ద్వారా షేరఱ్‌ చేయబడింది. వీడియో షేర్ చేసినప్పటి నుండి ఈ వీడియోకి 14.5 మిలియన్ల వీక్షణలను పొందింది.

ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ వీడియో చూసిన ప్రతిఒక్కరూ షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఎరకోసం వచ్చిన కొండచిలువ అక్కడి పాకలో కట్టేసిన పశువును మింగేసిందని వీడియో ద్వారా స్పష్టమవుతుంది. ఎరను మింగేసిన తర్వాత అది దాన్ని జీర్ణించుకోవటానికి కష్టపడుతుంది. పశువుకు కట్టిన తాడు.. పాము నోటి నుండి బయట వరకు అలాగే ఉంది. ఆ తాడును విడిపించుకోవడానికి కొండచిలువ తీవ్ర పోరాటం చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇది కొండచిలువ కంచెను దాటింది కానీ, నోటిలో చిక్కుకున్న తాడు అలాగే కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే ఈ వీడిఇయో 48,000 వీక్షణలను సంపాదించింది. పాము భారీ పరిమాణాన్ని చూసి సోషల్ మీడియా వినియోగదారులను షాక్‌ అవుతున్నారు. news.com.au నుండి వచ్చిన సమాచారం ప్రకారం, క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ బ్రయాన్ ఫ్రై వీడియోలోని జాతిని రెటిక్యులేటెడ్ పైథాన్‌గా గుర్తించారు. ఇది విషం లేని పాము అని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, ఈ కొండచిలువలు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కనిపించే అతిపెద్ద పాము జాతులలో ఒకటి. వీడియోను పంచుకున్న IFS అధికారి క్యాప్షన్‌లో ఇలా రాశారు..హ్యాపీగా పీకలదాకా తిన్న తర్వాత ఈ కొండచిలువ ట్రాప్‌లో చిక్కుకుందని రాశారు. వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…