AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేక్కడి విడ్డూరమండీ..! బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! షాక్‌లో డాక్టర్లు..

ఇద్దరు పిల్లల మధ్య ఇంత గ్యాప్ ఎలా ఉంటుందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. కవలల మధ్య దూరాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారు. 22 రోజుల తేడాతో కవలలు పుట్టడం కైలీతో పాటు డాక్టర్లు సహా అందరికీ షాకింగ్‌ విషయంగానే మారింది. ఒక బిడ్డ పుట్టి, మరో బిడ్డ ఎప్పుడు పుడుతుందా..? అని ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ, ఆమెకు ప్రసవ నొప్పులు కనిపించలేదు.

ఇదేక్కడి విడ్డూరమండీ..! బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత రెండో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి..! షాక్‌లో డాక్టర్లు..
Birth Baby
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2024 | 2:47 PM

Share

నేటి యుగంలో కవల పిల్లలు సర్వసాధారణం. చాలా మంది పిల్లలు కవలలుగా పుడుతున్నారు. అయితే, ఓ మహిళకు ఒక వింత జరిగింది. ఆ మహిళకు కవలలు పుట్టిన మాట వాస్తవమే. కానీ, మొదటి బిడ్డ పుట్టిన 22 రోజుల తర్వాత మరో ఆస్పత్రిలో రెండో బిడ్డ పుట్టింది. ఇది చాలా అరుదైన కేసు. కానీ దురదృష్టవశాత్తు, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ అరుదైన సంఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది.. ఇంగ్లాండ్‌లో నివసించే కైలీ డోయల్ అనే మహిళ గర్భవతిగా ఉంది.. కొన్ని నెలల క్రితం ఆమె కవలలకు తల్లి అయింది. అయితే పిల్లలిద్దరూ కేవలం 22 రోజుల తేడాతో పుట్టడం ఎలా సాధ్యం అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

నెలలు నిండడంతో కైలీ డోయల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఐదు రోజుల పాటు పరిశీలనలో ఉంచారు. తర్వాత ఆమె సహజంగానే తన మొదటి బిడ్డ అర్లోకు జన్మనిచ్చింది. పాప కేవలం 1.1 పౌండ్ల బరువుతో జన్మించి చనిపోయింది. ఆ చిన్నారి బొడ్డు తాడులో రక్తం గడ్డకట్టిందని, దీని కారణంగానే పాప చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. రెండవ బిడ్డ పూర్తిగా ఆరోగ్యంగా పుడుతుందని కైలీ ఆశపడింది. కానీ, అలాంటిదేమీ జరగలేదు. కొన్ని గంటల్లో ప్రసవ నొప్పి ఆగిపోయింది. అప్పటికీ కైలీకి మొదటి బిడ్డ పుట్టి రెండు రోజులు గడిచిపోయింది. దాంతో వైద్యులు ఆమెను ఇంటికి పంపించారు. 22 రోజుల తర్వాత, కైలీ మరో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆమె కవలల గురించి డాక్టర్‌కి చెప్పింది.

ఇద్దరు పిల్లల మధ్య ఇంత గ్యాప్ ఎలా ఉంటుందని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయారు. కవలల మధ్య దూరాన్ని వైద్యులు కూడా నమ్మలేకపోయారు. 22 రోజుల తేడాతో కవలలు పుట్టడం కైలీతో పాటు డాక్టర్లు సహా అందరికీ షాకింగ్‌ విషయంగానే మారింది. ఒక బిడ్డ పుట్టి, మరో బిడ్డ ఎప్పుడు పుడుతుందా..? అని ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ, ఆమెకు ప్రసవ నొప్పులు కనిపించలేదు. ఆమె ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతోంది. దాంతో వైద్యులు వెంటనే ఆమె శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీయాల్సి ఉంటుందని, లేకుంటే శిశువు చనిపోతుందని వైద్యులు తెలియజేశారు. కైలీ పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఆమె మాయ గర్భాశయం లోపలి గోడ నుండి విడిపోయింది.శిశువుకు ఆక్సిజన్ అందడం కష్టమైంది. పుట్టినప్పుడు శిశువు బరువు 2 పౌండ్లు. చిన్నారికి గుండెలో రంధ్రం ఏర్పడి కళ్లకు కూడా సమస్యలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…