AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: వీడు మాములోడు కాదు.. కుంభకర్ణుడ్ని మించిపోయాడు.. ఇడ్లీల కోసం 7 లక్షలు ఖర్చు పెట్టాడు!

వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షలు ఖర్చు చేశాడో ఓ వ్యక్తి. ఇదేదో చదువుల కోసమో.. ఇతర అవసరాల కోసమే ఖర్చు చేసింది కాదు.. కేవలం ఇడ్లి తినడానికి మాత్రమే ఖర్చు చేశాడు ఈ వ్యక్తి. హైదరాబాద్ కు చెందిన స్విగ్గీ కస్టమర్ గత 12 నెలల్లో రూ.7.3 లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీలో తేలింది.   'వరల్డ్ ఇడ్లీ డే' సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది. 

Viral News: వీడు మాములోడు కాదు.. కుంభకర్ణుడ్ని మించిపోయాడు.. ఇడ్లీల కోసం 7 లక్షలు ఖర్చు పెట్టాడు!
Idly
Balu Jajala
|

Updated on: Mar 31, 2024 | 12:29 PM

Share

వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా లక్షలు ఖర్చు చేశాడో ఓ వ్యక్తి. ఇదేదో చదువుల కోసమో.. ఇతర అవసరాల కోసమే ఖర్చు చేసింది కాదు.. కేవలం ఇడ్లి తినడానికి మాత్రమే ఖర్చు చేశాడు ఈ వ్యక్తి. హైదరాబాద్ కు చెందిన స్విగ్గీ కస్టమర్ గత 12 నెలల్లో రూ.7.3 లక్షల విలువైన ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు ఆన్ లైన్ లో ఫుడ్ డెలివరీలో తేలింది.   ‘వరల్డ్ ఇడ్లీ డే’ సందర్భంగా ఈ విషయం బయటకు వచ్చింది.

ఉదయం 8 గంటల నుంచి 10 గంటల సమయంలో చాలామంది ఇడ్లీలను ఆర్డర్ చేస్తుంటాడు. అయితే బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్, ముంబై సహా వివిధ నగరాలకు చెందిన కస్టమర్స్ డిన్నర్ సమయంలో ఇడ్లీలు తింటున్నారని స్విగ్గీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇడ్లీలను ఎక్కువగా ఆర్డర్ చేసే నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మొదటి మూడు స్థానాల్లో నిలవగా, ముంబై, పుణె, కోయంబత్తూరు, ఢిల్లీ, వైజాగ్, కోల్కతా, విజయవాడ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

బెంగళూరులో రవ్వ ఇడ్లీకి ప్రత్యేక ఆదరణ ఉండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెయ్యి/ కరమ్ పోడి ఇడ్లీకి మంచి ఆదరణ ఉంది. నగరాల్లో ఇడ్లీ ఆర్డర్లలో దట్టె ఇడ్లీ, మినీ ఇడ్లీలకు కూడా మంచి స్థానం లభిస్తుందని స్విగ్గీ తెలిపింది. మసాలా దోశ తర్వాత అత్యధికంగా ఆర్డర్ చేసిన బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ గా ఇడ్లీస్ రెండో స్థానంలో ఉంది. బెంగళూరులో ఆశా టిఫిన్లు, బెంగళూరు, చెన్నైలోని ఏ2బీ – అడయార్ ఆనంద భవన్, హైదరాబాద్లోని వరలక్ష్మీ టిఫిన్స్, చెన్నైలోని శ్రీ అక్షయం, బెంగళూరులోని వీణ స్టోర్స్ ఇడ్లీలకు ప్రసిద్ధి చెందిన టాప్ 5 రెస్టారెంట్లు ఉన్నాయి.