AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిచ్చి పీక్ స్టేజ్‌లో.. ఎయిర్ పోర్ట్‌లో యువతి చిల్లర చేష్టలు.. వైరస్ ఇక్కడికి పాకింది ఫైన్ వేయమంటూ..

రీల్స్ కోసం రద్దీగా ఉండే మెట్రో రైళ్లు, లోకల్ బస్సులు, వీధులు, వాగులు, వంకలు, స్కూల్స్, కాలేజీలు, ఇలా ఎక్కడ ఏ ప్రదేశంలో నైనా సరే యువత రీల్స్ చేయడమే ఉద్యమంగా సాగుతున్నారు. ఇది అంతం కాదు ఆరంభం అన్న చందంగా సాగుతుంది నేటి యువత తీరు. తాజాగా ఓ యువతి ఎయిర్ పోర్ట్ లో చేసిన రీల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

పిచ్చి పీక్ స్టేజ్‌లో.. ఎయిర్ పోర్ట్‌లో యువతి చిల్లర చేష్టలు.. వైరస్ ఇక్కడికి పాకింది ఫైన్ వేయమంటూ..
Woman's Video On Airport Baggage Carousel
Surya Kala
|

Updated on: Mar 31, 2024 | 11:06 AM

Share

చిన్న పెద్ద అనే తేడా లేకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి లైక్స్ ను సొంతం చేసుకోవడానికి రకరకాల వీడియోలు, రీల్స్ చేస్తూ  సందడి చేస్తున్నారు. లైక్స్ పిచ్చి ఎంతగా పెరిగిదంటే పరిసరాలతో పని లేదు.. ప్రాణం అంటే లెక్కలేదు అన్న చందంగా తయారు అయింది నేటి యువత తీరు. ముఖ్యంగా  బహిరంగ ప్రదేశాలు రీల్స్ కు, వీడియో కంటెంట్ సృష్టికి వేదికగా మారాయి. దీంతో తోటి ప్రయాణీకులు ప్రశాంతంగా ప్రయాణం చేసే పరిస్థితి లేని రోజులు వచ్చాయి. నిర్లక్ష్యపు ప్రవర్తన ఎక్కువగా నేటి యువతిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరు తమ ప్రవర్తనతో తమ చుట్టూ ఉన్నవారికి కలిగే అసౌకర్యాన్ని పట్టించుకోవడం లేదు కూడా..

రీల్స్ కోసం రద్దీగా ఉండే మెట్రో రైళ్లు, లోకల్ బస్సులు, వీధులు, వాగులు, వంకలు, స్కూల్స్, కాలేజీలు, ఇలా ఎక్కడ ఏ ప్రదేశంలో నైనా సరే యువత రీల్స్ చేయడమే ఉద్యమంగా సాగుతున్నారు. ఇది అంతం కాదు ఆరంభం అన్న చందంగా సాగుతుంది నేటి యువత తీరు. తాజాగా ఓ యువతి ఎయిర్ పోర్ట్ లో చేసిన రీల్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఒక యువతి విమానాశ్రయంలో సామానులను ప్రయాణీకులకు చేరవేసే కన్వేయర్ బెల్ట్ పై పడుకుని చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రీల్స్ “వైరస్ విమానాశ్రయాలకు కూడా చేరుకుంది” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను డెసిమోజిటో అనే వినియోగదారు Xలో షేర్ చేశారు. వీడియో వైరల్‌గా మారింది. 2 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఎయిర్‌పోర్టులో యువతి చేసిన పని సరి కాదంటూ పలువురు విమర్శించారు.

యువతి చేసిన పని సరికాదు.. కనుక ఆమెకు జరిమానా లక్షల్లో జరిమానా విధించండి. ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరికొందరు ఇటువంటి పని చేయకుండా ఆ యువతిని ఒక ఉదాహరణగా రూపొందించండి” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. మరొకరు “ఇది ఏమిటి? దయచేసి కనీసం ఎయిర్‌పోర్ట్‌ని అయినా వదిలేయండి” అని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..