సముద్రపు ఒడ్డున వింత జీవి.. మత్స్యకన్య , సముద్ర జీవి అంటూ భిన్న వాదనలు..

నిజంగా మత్య్సకన్య ఉందో లేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనిపై సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతునే ఉంది. కొందరు మత్స్య కన్య ఉనికిని విశ్వసిస్తే, చాలా మంది అదంతా అద్భుత కథ అని అంటారు. ఇప్పుడు అలాంటి గందరగోళం నెలకొంది. ఇటీవల పాపువా న్యూ గినియా తీరంలో మత్స్యకన్యలా కనిపించే వింత సముద్ర జీవి పర్యాటకుల కంట పడింది. దీన్ని చూసిన స్థానికులు నిజంగా మత్స్యకన్య అయి ఉంటుందా అని అయోమయంలో పడ్డారు.

సముద్రపు ఒడ్డున వింత జీవి.. మత్స్యకన్య , సముద్ర జీవి అంటూ భిన్న వాదనలు..
Strange Mermaid
Follow us
Surya Kala

|

Updated on: Mar 31, 2024 | 9:58 AM

ప్రపంచంలోని అనేక విషయాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి. అందులో మత్స్యకన్య ఒకటి. సినిమాల్లో మత్స్య కన్య ఉనికి గురించి చాలా కథలు ఉన్నాయి. సాగరకన్య సినిమాలో మత్య్సకన్య కనిపిస్తే.. కొరియన్ సిరీస్ చూసే వారికీ వెంటనే లెజెండ్ ఆఫ్ బ్లూ సీ గుర్తుకొస్తుంది. అంతగా మత్య్సకన్య ఆకట్టుకుంటుంది.    అయితే ఇది నిజంగా మత్య్సకన్య ఉందో లేదో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీనిపై సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతునే ఉంది. కొందరు మత్స్య కన్య ఉనికిని విశ్వసిస్తే, చాలా మంది అదంతా అద్భుత కథ అని అంటారు. ఇప్పుడు అలాంటి గందరగోళం నెలకొంది. ఇటీవల పాపువా న్యూ గినియా తీరంలో మత్స్యకన్యలా కనిపించే వింత సముద్ర జీవి పర్యాటకుల కంట పడింది. దీన్ని చూసిన స్థానికులు నిజంగా మత్స్యకన్య అయి ఉంటుందా అని అయోమయంలో పడ్డారు.

ఈ రహస్యమైన సముద్ర జీవి ఫోటోలు ఫేస్‌బుక్ ఖాతా న్యూ ఐర్లాండ్‌లో షేర్ చేయబడింది. ఇది చూసిన చాలా మంది ఇది ఎలాంటి వింత జీవి అని అయోమయంలో పడ్డారు. ఇది నిజమైన మత్స్య కాన్యే అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అయితే ఇది నిజంగా మత్స్యకన్యనా లేక మరేదైనా జీవి అనే విషయం గురించి నిపుణులు కూడా స్పందించారు. శాస్త్రవేత్తలు, నిపుణులు సైతం ఈ వింత జీవిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది మత్స్యకన్య కాదని, మరికొందరు సముద్ర జీవి అని కొందరు నిపుణులు అంటున్నారు.

సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయానికి చెందిన సముద్ర క్షీరద నిపుణుడు సస్చా హుకర్ ప్రకారం ఈ వింత జీవి మత్స్యకన్య కాదు. ఇది గ్లోబ్‌స్టర్ అని చెప్పాడు. గ్లోబ్స్టర్ అనేది తిమింగలాలు, సొరచేపలు మొదలైన భారీ సముద్ర జీవుల అవశేషాలు. అలాంటి జీవులు సముద్రంలో చనిపోయిన తర్వాత వాటి శరీర భాగాలు కుళ్లిపోయి ఈ విచిత్రమైన ఆకృతిని సంతరించుకుంటాయని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..