AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan: నిరుపేదల ఆకలి తీరుస్తున్న సారా అలీ ఖాన్.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..

తక్కువ సమయంలోనే తన కెరీర్‌లో చాలా పేరు సంపాదించుకుంది ఈ నటి. సినిమాల ద్వారా తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు వ్యక్తిగతంగా ప్రజలతో కలిసిపోవడానికి కూడా ఇష్టపడుతుంది. ముస్లిం కుటుంబంలో జన్మించిన సారా అలీ ఖాన్ హిందూ దేవాలయాలను సందర్శించడానికి వెళ్తుంది. ఇలా చేస్తూ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. అయినా సారా తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సారా కు సంబంధించిన మరొక వీడియో బయటపడింది.  దీనిలో ఆమె పేదవారికి సహాయం చేస్తుంది.

Sara Ali Khan: నిరుపేదల ఆకలి తీరుస్తున్న సారా అలీ ఖాన్.. వీడియో చూస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే..
Sara Ali Khan
Surya Kala
|

Updated on: Mar 31, 2024 | 9:14 AM

Share

సారా అలీ ఖాన్ తల్లి దండ్రులైన అమృతా సింగ్, సైఫ్ అలీ ఖాన్‌ల నుంచి నటనను వారసత్వంగా తీసుకుని సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. నటనతోనే కాదు.. మంచి మనసున్న అమ్మాయిగా అందరి మన్ననలు పొందుతుంది బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్. అవును సారా అంటే అందరికీ ఇష్టమే. తక్కువ సమయంలోనే తన కెరీర్‌లో చాలా పేరు సంపాదించుకుంది ఈ నటి. సినిమాల ద్వారా తన అభిమానుల హృదయాలను గెలుచుకోవడమే కాదు వ్యక్తిగతంగా ప్రజలతో కలిసిపోవడానికి కూడా ఇష్టపడుతుంది. ముస్లిం కుటుంబంలో జన్మించిన సారా అలీ ఖాన్ హిందూ దేవాలయాలను సందర్శించడానికి వెళ్తుంది. ఇలా చేస్తూ అనేక విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. అయినా సారా తాను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు సారా కు సంబంధించిన మరొక వీడియో బయటపడింది.  దీనిలో ఆమె పేదవారికి సహాయం చేస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సారా అలీ ఖాన్ ఒక సాధారణ అమ్మాయిలా రోడ్డు పక్కన నిలబడి పేద ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నట్లు చూడవచ్చు. ఒకొక్కరిని పలకరిస్తూ అందరి  యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ, కలుస్తూ మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ సమయంలో, నిరుపేదలు కూడా సారాకు ఆశీస్సులు అందజేయడం కనిపిస్తుంది. వీడియో చివర్లో సారా అలీ ఖాన్ పబ్లిక్ కంట పడకుండా దాక్కొని చాలా సింపుల్ గా కారులో కూర్చుని అక్కడి నుంచి ముందుకు వెళ్ళింది.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

సారా అలీఖాన్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు కూడా సారా మంచి మనసుకు సంబంధించిన ఇలాంటి వీడియోలు కనిపిస్తాయి. అందులో ఆమె ప్రజలకు సహాయం చేయడం..  వారితో సమయం గడపడం కనిపిస్తుంది. సారా అలీ ఖాన్ కు సంబంధించిన ఈ వీడియోలపై నెటిజన్లు స్పందిస్తూ ఉన్నారు. సారా చాలా డౌన్ టు ఎర్త్ అని కొందరు అంటుంటే, పబ్లిసిటీ స్టంట్స్ కోసమే ఆమె ఇలా చేస్తుందని మరికొందరు అంటున్నారు. ఇక సారా సినిమాల గురించి మాట్లాడుకుంటే..  రెండు సినిమాలు ఇటీవల విడుదలయ్యాయి. ఆమె మర్డర్ ముబారక్ , ఏ వతన్ మేరే వతన్‌లో కనిపించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!