TOP9 ET: చరణ్‌- ఎన్టీఆర్ కంటే ప్రభాసే ఆ విషయంలో గొప్ప | 158 కోట్ల ఆస్తికి అధిపతి.

TOP9 ET: చరణ్‌- ఎన్టీఆర్ కంటే ప్రభాసే ఆ విషయంలో గొప్ప | 158 కోట్ల ఆస్తికి అధిపతి.

Anil kumar poka

|

Updated on: Mar 31, 2024 | 11:09 AM

అభిమానులను ఫిదా చేయడంలో ఎవరు గొప్ప? అభిమానుల కోసం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడంలో ఎవరు గొప్ప? ఈ విషయంలో మాత్రం ప్రభాసే గొప్పా! అని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్. నీ ఇంజ్యూరీ ఉన్నా.. గ్యాప్‌ లేకుండా పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తోంది.. ప్రభాసే అని వారు గుర్తు చేస్తున్నారు. తమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకే కష్టపడుతున్నాడని చెబుతూ తమ డార్లింగ్‌ హీరోను మరో సారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

01.prabhas: చరణ్‌- ఎన్టీఆర్ కంటే ప్రభాసే ఆ విషయంలో గొప్ప.

అభిమానులను ఫిదా చేయడంలో ఎవరు గొప్ప? అభిమానుల కోసం గ్యాప్ లేకుండా సినిమాలు చేయడంలో ఎవరు గొప్ప? ఈ విషయంలో మాత్రం ప్రభాసే గొప్పా! అని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్‌ అండ్ నెటిజన్స్. నీ ఇంజ్యూరీ ఉన్నా.. గ్యాప్‌ లేకుండా పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్స్ కోసమే సినిమాలు చేస్తోంది.. ప్రభాసే అని వారు గుర్తు చేస్తున్నారు. తమల్ని ఎంటర్‌టైన్ చేసేందుకే కష్టపడుతున్నాడని చెబుతూ తమ డార్లింగ్‌ హీరోను మరో సారి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

02. jakkanna: 158 కోట్ల ఆస్తికి అధిపతి

ఎప్పుడూ సినిమానే లోకంగా కనిపించే జక్కన్న.. ఆ సినిమా కారణంగా బాగానే వెనకేశాడట. బాహుబలి సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారడమే కాదు.. ఆ సినిమాతో రెమ్యునరేషన్‌ను కూడా అమాతంగా పెంచేశాడు. అలా ఇప్పటి వరకు దాదాపు 158 కోట్ల ఆస్తుల వరకు ఈయన సంపాదించేశాడని టాక్.

03. vijay devarakonda: పెళ్లి చేసుకుంటా.!

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్టులో… లీస్ట్ ప్లేస్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ ఈ సారి కొత్తగా పెళ్లి పై కామెంట్స్ చేశాడు. తనకు పెళ్లి చేసుకోవాలని ఉందని.. చెప్పాడు. తను ప్రేమించిన అమ్మాయిని.. తమ పెద్దలకు పరిచయం చేసి… వాళ్లు ఒప్పుకున్నానే పెళ్లి చేసుకంటా అన్నాడు. తన అప్‌కమింగ్ ఫిల్మ్ ఫ్యామిలీ స్టార్‌ ప్రమోషనల్ ఈవెంట్లో ఈ మాటలు చెప్పాడు. అంతే…. అలా చెప్పాడో లేదో.. ఇలా తన మాటలకు రష్మికను యాడ్ చేసి.. నెట్టింట వైరల్ చేయడం మొదలెట్టారు కొంత మంది నెటిజన్స్‌. అండ్ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలనే ఫ్యాన్స్‌.

04. tillu: కలెక్షన్లు కుమ్మేస్తోన్న టిల్లు గాడు

టిల్లు గాడు ఎంట్రీ ఇస్తే డించక్ డించక్ ఆడాలా? ఇప్పుడు అలాగే ఆడుతోంది బాక్సాఫీస్ కూడా.! డీజె టిల్లుకు సీక్వెల్‌గా… మోస్ట్ అవేటెడ్ మూవీగా రిలీజ్‌ అయిన టిల్లు స్క్వేర్ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు.. డే1 వరల్డ్‌ వైడ్ 23.7 క్రోర్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టేసింది. ఈ రేంజ్‌ కలెక్షన్స్‌నే.. డే2,3,4 కూడా కంటిన్యూ చేసేలా కనిపిస్తోంది.

05. nithin: మళ్లీ తమ్ముడినే నమ్ముకున్న నితిన్.

పవర్ స్టార్ కుండే క్రేజ్ తమకు కొంచమ్మొచ్చినా చాలు.. తమ ఫిల్మ్ కెరీర్‌ ఏ రేంజ్లో ఎలిగిపోతుందని.. అనుకుంటారు చాలా మంది హీరోలు. అయితే నితిన్ మాత్రం అలా అనుకోవడమే కాదు.. అలా అయ్యేందుకు పవన్‌నే నమ్ముకున్నాడు. తన ఫెవరెట్ హీరో పవన్‌ను సెంటిమెంట్‌గా మార్చుకున్నాడు. తన సినిమాల్లో ఏదో రకంగా పవర్‌ స్టార్ ను గుర్తు కొచ్చేలా చేస్తూ.. హిట్స్ కొడుతున్నాడు. కానీ ఈ సారి ఏకంగా పవన్‌ కళ్యాణ్ సినిమా టైటిల్.. ‘తమ్ముడు’ తోనే మన ముందుకు వస్తున్నాడు. తన అప్‌కమింగ్ సినిమాకు తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ చేశాడు. ఇక వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నీ సినిమా నుంచి నితిన్ బర్త్‌ డే సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ అయింది.

06. nikhil: TDPలో చేరిన స్టార్ హీరో.

రీజనల్ సినిమాలతో పాటు.. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరో నిఖిల్.. వీలు దొరికనప్పుడల్లా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. చాలా అంశాలతో పాటు.. సామాజిక అంశాలపై కూడా తన స్టాండ్ ఏంటో చెబుతుంటారు. అలా చెబుతూనే మనోడిలో పొలిటికల్ స్పార్క్‌ ఉందనే కామెంట్ వచ్చేలా చేసుకున్నాడు. అయితే ఉన్నపళంగా ఇప్పుడా కామెంట్‌నే నిజం చేశాడు. తాజాగా తెలుగు దేశం పార్టీలో చేరిపోయాడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిఖిల్ .. ఈ స్టార్ హీరోకు టీడీపీ కండువా కప్పీ మరీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

07.tillu: స్టార్ ప్రొడ్యూసర్‌కు బంగారు బాతులా.!

ఇప్పుడు టిల్లు బంగారు బాతులా మారిపోయాడు. బాక్సాఫీస్‌ దగ్గర గోల్డెన్ హ్యాండ్‌ అయిపోయాడు. నాగ వంశీస్‌ సితార ఎంటర్ టైన్మెంట్స్‌ ప్రొడక్షన్స్‌లో డీజె టిల్లు కు సీక్వెల్‌గా తెరెకెక్కి టిల్లు స్వ్కేర్ రీసెంట్గా రిలీజ్ అయి.. మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో ఉంది. ఇక ఈ మూవీ ఫస్ట పార్ట్ డీజె టిల్లు కూడా.. ఈ ప్రొడక్షన్ హౌస్ కు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు టిల్లు స్వ్కేర్ కూడా అదే ప్రాఫిట్స్ రిపీట్ చేసేలా కనిపించడంతో.. టిల్లు గాడు ఈ ప్రొడక్షన్స్ హౌస్‌కు బంగారు బాతులా మారాడనే కామెంట్ నెట్టింట వస్తోంది.

08.prabhas: కన్నప్ప షూటింగ్‌కు ప్రభాస్‌?

ఎట్ ప్రజెంట్ కల్కి అండ్ రాజా సాబ్‌ షూటింగ్లో బిజీగా ఉన్న ప్రభాస్‌.. నెక్ట్స్‌ కన్నప్ప షూటింగ్‌లో కూడా పాల్గొనున్నారట. ఈ మూవీ కోసం తాజాగా తన డేట్స్‌ను సెట్ చేశారట. ఏప్రిల్ 12 నుంచి 5 రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే కన్నప్ప షూటింగ్లో పాల్గొననున్నారట. ఇక విష్ణు హీరోగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న కన్నప్ప మూవీలో ప్రభాస్‌ శంకరుడిగా క్యామియో ఇస్తున్నారు. పార్వతిగా నయన్‌ చేస్తున్నారు.

09.family star: రిలీజ్‌కు ముందే.. బయటికి వచ్చిన మూవీ రివ్యూ.

సినిమా రిలీజ్‌కు ముందే విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీ టాక్ బయటికి వచ్చింది. రీసెంట్గా సెన్సార్‌ సర్టిఫికేషన్‌ కోసం సెన్సార్‌ బోర్డ్‌ ముందుకు వెళ్లిన ఈ సినిమా.. బోర్డ్ సభ్యలను ఇంప్రెస్ చేసిందట. వారి కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్‌లో బోర్డ్‌ ఎంజాయ్‌ చేసిందట. సినిమా బాగుందనే రివ్యూ ఇచ్చేసిందట. ఇక ఇదే టాక్ బయటికి వచ్చి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 31, 2024 11:00 AM