AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా ?..

షారుఖ్ నికర విలువ దాదాపు రూ. 6000 కోట్లకు పైగా ఉంటుంది. షారుక్ 1991లో తన స్నేహితురాలు గౌరీ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. పెద్ద కుమారుడు ఆర్యన్ 1997లో జన్మించగా.. కూతురు సుహానా 2000లో జన్మించింది. వీరిద్దరి తర్వాత 13 సంవత్సరాల తర్వాత సరోగసీ తర్వాత అబ్రామ్‏కు స్వాగతం పలికారు. ఇప్పుడు షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ చిన్న కొడుకు అబ్రామ్ స్కూల్ ఫీజు ఎంతో తెలుసా ?..
Shahrukhkhan, Abram
Rajitha Chanti
|

Updated on: Mar 30, 2024 | 12:43 PM

Share

గత కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్‌ను శాసిస్తున్న హీరోలలో షారుఖ్ ఖాన్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. బాలీవుడ్ కింగ్.. బాద్ షా అంటూ పిలుచుకుంటారు ఫ్యాన్స్. చాలాకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమైన షారుఖ్.. గతేడాది సాలీడ్ కంబ్యాక్ ఇచ్చాడు. పఠాన్, జవాన్ చిత్రాలతో మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఈ రెండు చిత్రాలు దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. షారుఖ్ నికర విలువ దాదాపు రూ. 6000 కోట్లకు పైగా ఉంటుంది. షారుక్ 1991లో తన స్నేహితురాలు గౌరీ ఖాన్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించారు. పెద్ద కుమారుడు ఆర్యన్ 1997లో జన్మించగా.. కూతురు సుహానా 2000లో జన్మించింది. వీరిద్దరి తర్వాత 13 సంవత్సరాల తర్వాత సరోగసీ తర్వాత అబ్రామ్‏కు స్వాగతం పలికారు. ఇప్పుడు షారుఖ్ చిన్న కుమారుడు అబ్రామ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.

షారుఖ్ తనయుడు అబ్రామ్ ప్రస్తుతం ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇప్పటివరకు పాఠశాలలో జరిగే అన్ని పోటీలు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇటీవల జరిగిన ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవ వేడుకలలోనూ పాల్గొన్నాడు. తన తండ్రి షారుఖ్ సిగ్నేచర్ ఫోజ్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇదే పాఠశాలలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ తనయులు.. ఐశ్వర్య రాయ్ కూతురు ఆరాద్య కూడా చదువుకుంటున్నారు. అయితే ఈ పాఠశాలలో చదివే స్టార్ కిడ్స్ స్కూల్ ఫీజులు తెలిస్తే మాత్రం గుండె ఆగిపోవాల్సిందే.

ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజులు ఒక్కో తరగతికి మారుతూ ఉంటాయి. నివేదికల ప్రకారం, ఎల్‌కెజి నుండి 7వ తరగతి వరకు నెలవారీ ఫీజు దాదాపు రూ.1.70 లక్షలుపైగానే ఉంటుంది. అలాగే 8వ తరగతి నుంచి పదవ తరగతి వరకు నెలవారీ ఫీజు రూ.4.48 లక్షలు. కాగా 11వ, 12వ తరగతి ఫీజు దాదాపు రూ.9.65 లక్షలు. స్కూల్ ఫీజు స్ట్రక్చర్ ప్రకారం అబ్రామ్ సంవత్సరానికి ఫీజు దాదాపు రూ.20.40 లక్షలు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ భారతదేశంలోని అత్యుత్తమ పాఠశాలల్లో ఒకటి. 2003లో ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్థాపించారు. 1,30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ పాఠశాలలో ఆధునిక సౌకర్యాలతో నిర్మించారు. మొత్తం 7 అంతస్తుల భవనంలో ప్లే గ్రౌండ్, ఇంటర్నెట్ సౌకర్యం, టెర్రస్ గార్డెన్, రూఫ్ గార్డెన్, టెన్నిస్ కోర్ట్ ఉన్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.