IPL 2024: హార్దిక్ పాండ్యాకు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌ కు హిత బోధ.. ఏమన్నాడో తెలుసా?

హార్దిక్ బౌండరీకి ​​సమీపంలో ఫీల్డింగ్ చేస్తుంటే లేదా ఔట్ అయిన తర్వాత తిరిగి పెవిలియన్‌కు వెళ్తుంటే, రోహిత్ శర్మ పేరును పదే పదే ఉచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ ను ఇంతలా ద్వేషించడం సరికాదంటూ పలువురు సెలబ్రిటీలు అతనికి అండగా నిలుస్తున్నారు

IPL 2024: హార్దిక్ పాండ్యాకు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌ కు హిత బోధ.. ఏమన్నాడో తెలుసా?
Sonu Sood, Hardik Pandya
Follow us
Basha Shek

|

Updated on: Mar 29, 2024 | 7:46 PM

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ‘ఐపీఎల్ 2024’లో ఆశించిన శుభారంభం దక్కలేదు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓడిపోయింది. ఈ ఓటములుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యాను బాధ్యుడిని చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అహ్మదాబాద్, హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలలో కూడా ప్రేక్షకులు అతన్ని ఆటపట్టించారు. హార్దిక్ బౌండరీకి ​​సమీపంలో ఫీల్డింగ్ చేస్తుంటే లేదా ఔట్ అయిన తర్వాత తిరిగి పెవిలియన్‌కు వెళ్తుంటే, రోహిత్ శర్మ పేరును పదే పదే ఉచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హార్దిక్ ను ఇంతలా ద్వేషించడం సరికాదంటూ పలువురు సెలబ్రిటీలు అతనికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా పాండ్యాకు అండగా నిలిచాడు. హార్దిక్ పై జరుగుతోన్న ట్రోలింగ్ ను ఉద్దేశించి X (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారా యన. ఇందులో హార్దిక్ పాండ్యా పేరును నేరుగా ప్రస్తావించకపోయినా అతనినపై జరుగుతోన్న ట్రోలింగ్‌కు వ్యతిరేకంగానే ఆయన చేసిన ఈ పోస్ట్‌ అని స్పష్టమవుతోంది.

‘మన దేశ క్రీడాకారులే మన హీరోలు. మన ఆటగాళ్లను మనం గౌరవించాలి. ఒక రోజు మీరు వారిని ఉత్సాహపరుస్తారు, మరుసటి రోజు విసిగిస్తారు. దీనివల్ల వారే కాదు అందరూ బాధపడతారు. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నా దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి క్రికెటర్‌ని నేను ప్రేమిస్తున్నాను. అతను ఏ ఫ్రాంచైజీ కోసం ఆడతాడో నేను పట్టించుకోను. అతను కెప్టెన్‌గా ఆడుతున్నాడా లేదా జట్టులో 15వ ఆటగాడిగా ఆడుతున్నాడా అనేది నాకు ముఖ్యం కాదు. అతనే మా హీరో’ అని సోనూసూద్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ‘కరెక్ట్ గా చెప్పారు సర్. ఇకనైనా హార్దిక్ ను ద్వేషించడం ఆపేయండి’ అంటూ అభిమానులు, నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సోనూ సూద్ ట్వీట్..

IPL 2024 ప్రారంభంలో, ముంబై ఇండియన్స్ జట్టు వివిధ కారణాల వల్ల వివాదంలో చిక్కుకుంది. ఐపిఎల్ 2024 వేలానికి ముందు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ నుంచి విండో ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి తిరిగి వచ్చాడు. అంతేకాదు ఐపీఎల్ 2024కి ముందు, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మను ఇలా కెప్టెన్సీ నుంచి తప్పించడం అభిమానులకు నచ్చలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు. ఈ రెండు మ్యాచ్‌ల సమయంలో హార్దిక్ పాండ్యా స్టేడియంలో విపరీతంగా ట్రోల్ అయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ