IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 17వ ఎడిషన్ ఆశించిన శుభారంభం దక్కలేదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓడిపోయింది. ముఖ్యంగా బుధవారం (మార్చి 27) హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఆటతీరు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

IPL 2024: ముంబై ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే
Mumbai Indians
Follow us

|

Updated on: Mar 28, 2024 | 8:13 PM

ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ 17వ ఎడిషన్ ఆశించిన శుభారంభం దక్కలేదు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు ఓడిపోయింది. ముఖ్యంగా బుధవారం (మార్చి 27) హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై జట్టు ఆటతీరు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. దీనికి తోడు ఐపీఎల్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మను టోర్నీ ఆరంభంలోనే కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో పాండ్యా సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు పరాజయాలు చవిచూడడం కూడా ముంబై ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురిచేసింది. వీటన్నింటి మధ్య ముంబై ఇండియన్స్ అభిమానులకు ఒక శుభ వార్త. అదేంటంటే హార్దిక్ పాండ్యా టీమ్‌ తమ తదుపరి 4 మ్యాచ్‌లను వారి సొంత మైదానమైన వాంఖడేలో ఆడనుంది. ఏప్రిల్ 1న వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. ఐపీఎల్ 2024 సీజన్ లో జరిగిన 8 మ్యాచ్‌లను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో తప్పక విజయం సాధిస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పటి వరకు సొంత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఏ ఆతిథ్య జట్టు ఓడిపోలేదు.

మార్చి 22 నుంచి ప్రారంభమైన ఐపీఎల్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరిగాయి. ఈ ఎనిమిది మ్యాచ్‌ల్లో తమ సొంత మైదానాల్లో ఆడిన అన్ని జట్లు విజయం సాధించాయి. దీనికి విరుద్ధంగా విజిటింగ్ జట్టు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. RCB కథ కూడా ఇదే. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన ఆర్సీబీ.. సొంతగడ్డపై జరిగిన రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది. దీని ప్రకారం, ముంబై తన మొదటి రెండు మ్యాచ్‌లను ఇతర నగరాల్లో ఆడింది. తొలి మ్యాచ్‌లో ముంబై గుజరాత్ జట్టుతో అహ్మదాబాద్‌లో తలపడగా, రెండో మ్యాచ్ ఎస్‌ఆర్‌హెచ్ హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో జరిగింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైకు ఓటమి ఎదురైంది.

ఏప్రిల్ 1న వాంఖడే స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 7న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 11న స్వదేశంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనూ, ఏప్రిల్ 14న వాంఖడేలో పంజాబ్ కింగ్స్‌తోనూ తలపడనుంది. అంటే ఆ జట్టు తమ సొంత మైదానంలో వరుసగా 4 మ్యాచ్‌లు ఆడనుంది. కాబట్టి ముంబైకి వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచే అవకాశం ఉంది. జట్టు తదుపరి మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉంది. దీంతో జట్టు తన వ్యూహాన్ని మార్చుకునే అవకాశం వచ్చింది. మరి స్వదేశంలో జట్టు ఎలా రాణిస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ