Barrelakka: ‘బర్రెలక్క’ పెళ్లి కూతురాయనే! గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్.. వీడియో చూశారా?

సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. గురువారం (మార్చి 28)న బర్రెలక్క వివాహ వేడుక జరగనుంది.

Barrelakka: 'బర్రెలక్క' పెళ్లి కూతురాయనే! గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్.. వీడియో చూశారా?
Barrelakka Wedding
Follow us
Basha Shek

|

Updated on: Mar 27, 2024 | 6:33 PM

సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన ఆమె వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుంది. గురువారం (మార్చి 28)న బర్రెలక్క వివాహ వేడుక జరగనుంది. బుధవారం (మార్చి 26) నుంచే ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా పెళ్లి కూతురిగా అందంగా ముస్తాబైంది శిరీష. దీనికి సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిందామె. దీనికి ‘పెళ్లి పిల్లను చేస్తున్నారు’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు బర్రెలక్కకు ముందస్తు పెళ్లి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచింది బర్రెలక్క. సుమారు 5 వేలకు పైగా ఓట్లు సాధించి అక్కడ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత లోక్‌ సభ ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతానందామె. అయితే సడెన్ గా పెళ్లిపీటలెక్కనున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. కొన్ని రోజల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న ఆమె ఇటీవల కాబోయే భర్తతో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ లోనూ పాల్గొంది. కాబోయే భర్తను కూడా తన సోషల్‌ మీడియా ఫాలోవర్లకు పరిచయం చేసింది. అయితే ఇప్పటివరకు తనకు కాబోయే వరుడి గురించి ఎలాంటి వివరాలు పంచుకోలేదు శిరీష. కేవలం పెళ్లికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ వీడియోను షేర్ చేస్తూ తన భర్త ఇన్ స్టా ఐడికి ట్యాగ్ చేసింది. బర్రెలక్కకు కాబోయే భర్త పేరు వెంకటేశ్ అని అతడి ఇన్ స్టా ఐడినీ చూస్తే తెలుస్తోంది. అతను ఎంఎస్సీ ఫిజిక్స్‌ మినహా.. మరే వివరాలు అందులో కనిపించలేదు. మొత్తానికి బర్రెలక్క ప్రీ వెడ్డింగ్ వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

పెళ్లి కూతురిగా బర్రెలక్క.. వీడియో..

కాబోయే భర్తతో కర్నె శిరీష..

ప్రీ వెడ్డింగ్ షూట్ లో బర్రెలక్క..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!