- Telugu News Photo Gallery Cinema photos Boolywood Actor Ranbir Kapoor Preparing For Ramayana Movie He Is Going For Archer Training, Photos Goes Viral
Ramayana: విల్లు, బాణాలతో రణ్‌బీర్ కపూర్.. రామాయణం కోసం గట్టిగానే ప్రిపేర్ అవుతున్నాడుగా.. ఫొటోస్ చూశారా?
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ 'రామాయణం' సినిమా కోసం గట్టిగానే ప్రిపేరవుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసమే అతను మద్యం, మాంసాహారం మానేసినట్లు సమాచారం. అంతేగాక ఇప్పుడు క్లీన్ షేవ్ లుక్‌లో కూడా కనిపిస్తున్నాడు రణ్ బీర్. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
Updated on: Mar 26, 2024 | 10:40 PM

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ 'రామాయణం' సినిమా కోసం గట్టిగానే ప్రిపేరవుతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసమే అతను మద్యం, మాంసాహారం మానేసినట్లు సమాచారం. అంతేగాక ఇప్పుడు క్లీన్ షేవ్ లుక్‌లో కూడా కనిపిస్తున్నాడు రణ్ బీర్. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

రాముడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు రెడీ అవుతున్నాడు రణ్ బీర్ కపూర్.ఇందు కోసం విల్లు పట్టుకోవడం, బాణం ఎక్కుపెట్టడం వంటివి ప్రాక్టీస్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో.

రణబీర్ కపూర్ విల్లు, బాణాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా శిక్షకులను నియమించుకున్నాడు రణ్ బీర్. వారి దగ్గరే రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

రణబీర్ కపూర్ యోగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. 'రామాయణం' షూటింగ్ కు ముందు చాలా ప్రిపరేషన్‌తో వెళతాడని అతని సన్నిహితులు అంటున్నారు.

రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' చిత్రం గతేడాది విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 900 కోట్ల రూపాయల బిజినెస్ చేయడం విశేషం.