- Telugu News Photo Gallery Cinema photos Actress Janhvi Kapoor Completes Jr.NTR Devera Movie Shooting
Janhvi Kapoor: జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’పై బిగ్ అప్డేట్ ఇచ్చిన జూనియర్ శ్రీదేవి.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ ప్రముఖ నటి జాన్వీ కపూర్ 'దేవర' సినిమాతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే ఏకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేఅవకాశం దక్కించుకుందీ అందాల తార.
Updated on: Mar 26, 2024 | 10:21 PM

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు, బాలీవుడ్ ప్రముఖ నటి జాన్వీ కపూర్ 'దేవర' సినిమాతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే ఏకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించేఅవకాశం దక్కించుకుందీ అందాల తార.

దేవర’ సినిమాలో జాన్వీ రెండు షేడ్స్ ఉన్న పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ఆమె తంగం అనే సముద్రయాన యువతి పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

తాజాగా దేవర సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది నటి జాన్వీ కపూర్. 'దేవర' సినిమాలో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది.ఈ మేరకు తన పాత్ర షూటింగ్ పూర్తయిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్.

'దేవర' సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుండగా, ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా రెండో భాగం షూటింగ్‌లో జాన్వీ తంగం పాత్రలో నటిస్తుంది.

'దేవర' సినిమా తర్వాత జాన్వీ కపూర్ రామ్‌చరణ్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా నటించనున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు.