- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Next Films Lineup For 2025 Is Interesting, Check Details
Ram Charan: రామ్ చరణ్ ఊర మాస్ ప్లానింగ్.. 2025 దద్దరిల్లాల్సిందే..
ఓ వైపు గేమ్ ఛేంజర్ షూటింగ్ అయిపోనే లేదు.. అంతలోనే బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్ జరిగింది.. ఇప్పుడేమో సుకుమార్ సినిమాను ప్రకటించారు రామ్ చరణ్. అసలీయన ప్లానింగ్ ఏంటి..? ఇంత బిజీలో సుక్కు సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది..? పైగా 2025లో రిలీజ్ అంటున్నారు. ఈ లెక్కన గురుశిష్యుల సినిమాల్ని చరణ్ ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్తారా..? కొన్నాళ్లుగా అనుకుంటున్నదే అధికారికంగా చెప్పారు దర్శక నిర్మాతలు. రంగస్థలం కాంబినేషన్ మరోసారి రాబోతుంది.
Updated on: Mar 26, 2024 | 9:13 PM

ఓ వైపు గేమ్ ఛేంజర్ షూటింగ్ అయిపోనే లేదు.. అంతలోనే బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్ జరిగింది.. ఇప్పుడేమో సుకుమార్ సినిమాను ప్రకటించారు రామ్ చరణ్. అసలీయన ప్లానింగ్ ఏంటి..? ఇంత బిజీలో సుక్కు సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుంది..? పైగా 2025లో రిలీజ్ అంటున్నారు. ఈ లెక్కన గురుశిష్యుల సినిమాల్ని చరణ్ ఒకేసారి సెట్స్‌పైకి తీసుకెళ్తారా..?

కొన్నాళ్లుగా అనుకుంటున్నదే అధికారికంగా చెప్పారు దర్శక నిర్మాతలు. రంగస్థలం కాంబినేషన్ మరోసారి రాబోతుంది. శిష్యుడు బుచ్చిబాబు సినిమా ఓపెనింగ్ జరిగిన వారం లోపే.. గురువు సుకుమార్ ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచారు మెగా వారసుడు. అయితే ఈ రెండు సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారనేదే ఆసక్తికరంగా మారింది.

ఇండియన్ 2 షూటింగ్ పూర్తైపోవడంతో.. కొన్ని రోజులుగా గేమ్ ఛేంజర్‌తోనే బిజీగా ఉన్నారు శంకర్. జూన్ లోపు ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తుంది. డిసెంబర్ రిలీజ్‌కు గేమ్ ఛేంజర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇక జూన్ నుంచి బుచ్చిబాబు సినిమా సెట్స్‌పైకి రానుంది. ఈ లోపు పుష్ప 2ను పూర్తి చేయాలని చూస్తున్నారు సుకుమార్. ఆగస్ట్ వరకు పుష్ప 2తోనే ఈయన జర్నీ సాగుతుంది.

RC16తో పాటు RC17 కూడా 2025లోనే విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు. పైగా ఈ రెండింటినీ నిర్మిస్తుంది మైత్రి మూవీ మేకర్సే. అందుకే ఓ అండర్‌స్టాండింగ్‌తో ముందుకెళ్తున్నారు వాళ్లు. పుష్ప 2 నుంచి సుకుమార్ ఫ్రీ అయ్యేలోపు.. బుచ్చిబాబు సినిమా పూర్తి చేయాలనేది చరణ్ ప్లాన్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ అయిపోయింది కాబట్టి.. ఆర్నెళ్లలోనే షూట్ పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చి.

ఒకవేళ నిజంగానే ఆర్నెళ్లలో RC16 పూర్తైతే.. డిసెంబర్ నుంచి RC17 సెట్స్‌పైకి రానుంది. పుష్పలా ఐదేళ్లు కాకుండా.. ఏడాదిలోనే చరణ్ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు. రంగస్థలంకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు సుకుమార్. ఒకవేళ ఈ ప్లానింగ్ అంతా వర్కవుట్ అయితే 2025 పూర్తయ్యేలోపు రామ్ చరణ్ నుంచి 3 సినిమాలు విడుదలవుతాయి.




