Brahmanandam: ఆ కళాకారుడి కుటుంబానికి అండగా బ్రహ్మానందం.. ఆర్థిక సాయంగా ఎన్ని లక్షలిచ్చారో తెలుసా?

ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బ్రహ్మానందం. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడే తన ఉదారతను చాటుకున్నారు బ్రహ్మీ. మరణించిన కళాకారుడు కుటుంబానికి..

Brahmanandam: ఆ కళాకారుడి కుటుంబానికి అండగా బ్రహ్మానందం.. ఆర్థిక సాయంగా ఎన్ని లక్షలిచ్చారో తెలుసా?
Brahmanandam
Follow us

|

Updated on: Mar 26, 2024 | 7:03 PM

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీకి కేరాఫ్ అడ్రస్‌ అంటే ఠక్కున గుర్తుకు పేరు బ్రహ్మానందం. వేయికి పైగా సినిమాల్లో తన అద్భుతమైన నటనతో సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారాయన. తన నటనా ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు, పురస్కారాలు సొంతం చేసుకున్నారు బ్రహ్మానందం. అన్నిటికీ మించి ‘హాస్య బ్రహ్మ’ గా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదాయన. అయితే చాలామంది లాగే ఓటీటీల్లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు బ్రహ్మానందం. ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వర చిత్రార్చన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక్కడే తన ఉదారతను చాటుకున్నారు బ్రహ్మీ. మరణించిన కళాకారుడు కుటుంబానికి రూ.2.17 లక్షల ఆర్థిక సాయమందించారు బ్రహ్మనందం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ‘బ్రహ్మీది ఎంత గొప్ప మనసో’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ అందరికీ రావు… అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం. కళాకారులు తమ బాహ్య రూపానికి కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు…గడ్డిపువ్వులో అందాన్ని చూస్తేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్ధమవుతుంది’ అని తనదైన శైలిలో ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి

శ్రీవారి సేవలో బ్రహ్మానందం..

త్వరలోనే ఓటీటీలో సందడి చేయనున్నారు బ్రహ్మానందం. ఆయన ఓటీటీ ఎంట్రీ మూవీకి ‘VVY’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.  ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్  ఈటీవీ విన్ లో జూలై 18న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. రోడ్ జర్నీ బ్యాక్ డ్రామ్ లో ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్ పోస్టర్ లో ఎల్లో కలర్ వ్యాన్ ను చూపించారు.

ఓటీటీలో సందడి చేయనున్న హాస్య బ్రహ్మ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి