Ram Charan : రామ్ చరణ్ బర్త్ డేకు మరిచిపోలేని బహుమతి ఇచ్చిన తల్లి సురేఖ.. 500 మందికి

చిరుత సినిమాతో హీరోగా పరిచయమైనా చరణ్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో  సినిమా చేశాడు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో చరణ్ రేంజ్ పెరిగిపోయింది.

Ram Charan : రామ్ చరణ్ బర్త్ డేకు మరిచిపోలేని బహుమతి ఇచ్చిన తల్లి సురేఖ.. 500 మందికి
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2024 | 7:22 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. చిరుత సినిమాతో హీరోగా పరిచయమైనా చరణ్ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో  సినిమా చేశాడు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దాంతో చరణ్ రేంజ్ పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు రామ్ చరణ్. ఇక రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమా అంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో చరణ్ తన నటనతో కట్టిపడేసాడు.

ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించి మెప్పించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన చరణ్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్  సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే చరణ్ కు కోట్లల్లో అభిమానులున్నారు. చరణ్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. ఇక చరణ్ బర్త్ డే అయితే సంబరాలు అంబరాన్ని అంటాల్సిందే.

మార్చ్ 27 న చరణ్ పుట్టిన రోజు. అభిమానులంతా ఇప్పటికే రెడీ అయ్యారు. చరణ్ బర్త్ డేకు సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే చరణ్ బర్త్ డేకు చిరంజీవి సతీమణి, చరణ్ తల్లి సురేఖ ఓ భారీ గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ బర్త్ డే సందర్భంగా అత్తమ్మాస్ కిచెన్ సంస్థ తరపున 500 మందికి అన్నదానం చేశారు. అపోలో లోని ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు సురేఖ. ఆమె స్వయంగా వండి.. అక్కడివారిని వడ్డించి.. దగ్గరుండి అన్ని చూసుకున్నారు సురేఖ. ఈ కార్యక్రమానికి చిన్నజియ్యర్ స్వామి హాజరయ్యారు. ఇందుకు సంబందించిన వీడియోను అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చరణ్ తల్లి పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

అత్తమ్మస్ కిచన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల, బ్రహ్మ
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల, బ్రహ్మ
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..