AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR : ఎన్టీఆర్ నయా మూవీ కూడా అదే దారిలో.. తారక్ ఫ్యాన్స్‌కు పూనకాలే

మొట్ట మొదటిగా 'బాహుబలి' రెండు భాగాలుగా వచ్చింది. ఆ తర్వాత 'కేజీఎఫ్' , 'పుష్ప' సహా చాలా సినిమాలు ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. కథను వివరంగా చెప్పడానికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఈ లైన్‌లోకి మరో సినిమా యాడ్ అవ్వనుందని తెలుస్తోంది. అది ఏ హీరో సినిమానో తెలుసా.? ఆయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

NTR : ఎన్టీఆర్ నయా మూవీ కూడా అదే దారిలో.. తారక్ ఫ్యాన్స్‌కు పూనకాలే
జూనియర్ ఎన్టీఆర్
Rajeev Rayala
|

Updated on: Mar 26, 2024 | 6:30 PM

Share

ఇటీవల సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించి, రిలీజ్ చేయడం ట్రెండ్ గా మారింది. ప్రస్తుతం చాలా సినిమాలు రెండు భాగాలుగా విడుదలవుతున్నాయి. మొట్ట మొదటిగా ‘బాహుబలి’ రెండు భాగాలుగా వచ్చింది. ఆ తర్వాత ‘కేజీఎఫ్’ , ‘పుష్ప’ సహా చాలా సినిమాలు ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. కథను వివరంగా చెప్పడానికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది అంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఈ లైన్‌లోకి మరో సినిమా యాడ్ అవ్వనుందని తెలుస్తోంది. అది ఏ హీరో సినిమానో తెలుసా.? ఆయన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఇప్పటికే ‘దేవర’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ యాక్షన్ సినిమా సెట్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ న్యూ మూవీ గురించి ఆసక్తికర న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా రెండు భాగాలుగా రానుందని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ‘కేజీఎఫ్’ రెండు భాగాలుగా విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు మూడో భాగం కూడా రెడీ అవుతుంది. అదేవిధంగా ‘సాలార్’ సినిమా ఒక భాగం విడుదల కాగా, రెండో భాగం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అదేవిధంగా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. మొదటి భాగం విడుదలైన తర్వాత రెండో భాగాన్ని చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నారు. సెట్‌లోనే కాకుండా 10కి పైగా దేశాల్లో చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట.

‘కేజీఎఫ్ 3’ పనుల్లో ప్రశాంత్ నీల్ త్వరలోనే ప్రారంభించనున్నారు. దాంతో ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి వెళ్లడం అనుమానమే అని అంటున్నారు. ‘సలార్’ సినిమా సెకండ్ పార్ట్ లో ప్రశాంత్ నీల్ ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంది.  ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. ఈ సినిమా విడుదలయ్యాక ‘కేజీఎఫ్ 3’ సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. దీని పై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఎన్టీఆర్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..