Hanu Man OTT: ‘హనుమాన్’ క్రేజ్ మామలుగా లేదుగా.. మరో ఓటీటీలో బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ' హనుమాన్ ' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి తదితరులు 'హనుమాన్' చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘ హనుమాన్ ‘ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సూపర్ హీరో కాన్సెప్ట్ మూవీలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ‘హనుమాన్’ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలో విడుదలైన హనుమాన్ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేస్తోంది. విశేషమేమిటంటే, ఈ చిత్రం మూడు వేర్వేరు OTT ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. ముందుగా మార్చి 16న ‘హనుమాన్’ సినిమా హిందీ వెర్షన్ ‘జియో సినిమా’ OTTలో అందుబాటులోకి వచ్చింది. ఆ తరువాత, మార్చి 18న, తెలుగు వెర్షన్ Zee 5 OTTలో వీక్షించడానికి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు మరో ప్రముఖ ఓటీటీలో హనుమాన్ సందదడి చేయనుంది. ఏప్రిల్ 5 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో కన్నడ, మలయాళం, తమిళ వెర్షన్‌లు ప్రసారం కానున్నాయి. ఈ విషయాన్ని హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించాడు.
సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. అంజనాద్రి అనే కాల్పనిక పట్టణంలో అంజనాద్రి ఆశీస్సులతో అతీతశక్తులను పొందే ఒక గ్రామ యువకుడి కథ ఈ చిత్రం. హనుమంతు పాత్రలో, సూపర్ హీరోగా తేజ సజ్జా అద్భుతంగ నటించాడు. ఈ సినిమా తర్వాత అతని డిమాండ్, రెమ్యునరేషన్ భారీగా పెరిగాయి. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. స్టార్ నటీనటులు ఈ సినిమాలో కనిపించనున్నారని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో…
Tamil, Malayalam and Kannada versions of #HanuMan premieres April 5th on @DisneyPlusHS 😃#HanuManOnHotstar pic.twitter.com/PQvJWoTvZb
— Prasanth Varma (@PrasanthVarma) March 26, 2024
జీ 5 లో తెలుగు వెర్షన్..
Explore the breathtaking world of Hanuman in jaw-dropping 4K❤️ #HanuMan streaming now on #ZEE5
Available in Telugu with English subtitles.
▶️ https://t.co/BEtA2aZJdh#JaiShreeHanuman #HanuManOnZEE5 #ZEE5Global@PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha @varusarath5… pic.twitter.com/DDWEcwTyXv
— ZEE5 Global (@ZEE5Global) March 26, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








