Gaami OTT : ఓటీటీలోకి విశ్వక్ సేన్ గామి.. స్ట్రీమింగ్ అప్పటినుంచేనా..?
కొత్త సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందంటే చాలు ఆ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులకు ఆసక్తి చూపుతుంటారు. రీసెంట్ గా థియేట్సర్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా గామి.
థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి రి రావడానికి పెద్దగా టైం తీసుకోవడం లేదు. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. సినిమా సూపర్ హిట్ అయ్యింతే కొంచం టైం తీసుకొని ఓటీటీలోకి వస్తున్నాయి. కొత్త సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందంటే చాలు ఆ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులకు ఆసక్తి చూపుతుంటారు. రీసెంట్ గా థియేట్సర్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకున్న సినిమా గామి. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
ఇక ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యిందని తెలుస్తోంది. త్వరలోనే గామి సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాకు విధ్యాదర్ కాగిత దర్శకత్వం వహించాడు. క్రౌడ్ ఫండింగ్ విధానంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఆరేళ్ళు పట్టింది.
ఈ సినిమాలో చాందిని చౌదరి, అభియన కీలక పాత్రల్లో నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విశ్వక్ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా గా నిలిచింది గామి. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రానుందన్న వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఏప్రిల్ 5న గామి సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ గామి డిజిటల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని అంటున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో గామి సినిమా స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.