Vikramarkudu: అమ్మబాబోయ్.. విక్రమార్కుడు చైల్డ్ ఆర్టిస్ట్ మతిపోగోడుతుందిగా..!
పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అదరగొట్టిన రవితేజ.. మరో పాత్రలో అత్తిలి సత్తిబాబుగా తన కామెడీతో ఇరగదీశారు. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు మాస్ రాజా.. ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా..? తన అమాయకపు మాటలతో రవితేజను నాన్న అంటూ పిలుస్తూ ఆకట్టుకుంది ఆ చిన్నది.
మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాలో విక్రమార్కుడు సినిమా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో అదరగొట్టిన రవితేజ.. మరో పాత్రలో అత్తిలి సత్తిబాబుగా తన కామెడీతో ఇరగదీశారు. రెండు పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించారు మాస్ రాజా. ఇక విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురుగా నటించిన చిన్నారి గుర్తుందా..? తన అమాయకపు మాటలతో రవితేజను నాన్న అంటూ పిలుస్తూ ఆకట్టుకుంది ఆ చిన్నది. విక్రమార్కుడు సినిమా తర్వాత పలు సినిమాల్లో ఆ చిన్నారి నటించింది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రక్ష అనే హారర్ మూవీలోనూ నటించింది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది ఆ చిన్నారి.
అయితే ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉంది..? ఏం చేస్తుంది.? ఇలా ఆ చిన్నారి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తిగా గూగుల్ ను గాలిస్తున్నారు. ఆ చిన్నారి పేరు నేహా. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలల్లో నటించి మెప్పించింది ఆ చిన్నారి. ఆతర్వాత చదువుల పై దృష్టి పెట్టి సినిమాలకు దూరం అయ్యింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా విక్రమార్కుడు, అనసూయ, రాముడు, ఆది విష్ణు, రక్ష, సర్కార్ చిత్రాల్లో కూడా కనిపించింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయ్యింది.
ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. ఈ చిన్నది అమెరికాలోని ఫ్లోరిడాలో నేహా జన్మించింది. కానీ ఆమె తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. నేహా సినిమాల్లో నటించి దాదాపు 10ఏళ్ళు పైనే అయ్యింది. సినిమాల కంటే ఆమె తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. మొన్నీమద్యే ఎంబీబీఎస్ పూర్తి చేసింది నేహా. ఇప్పుడు ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.