Article 370 OTT: ఓటీటీలోకి వివాదాస్పద మూవీ.. యామీ గౌతమ్ ‘ఆర్టికల్ 370’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయాలకు సంబంధించిన కొన్ని సినిమాలు విడుదల కావడం మామూలే. అలా కొద్ది రోజుల క్రితం 'ఆర్టికల్ 370' సినిమా విడుదలైంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ కీలక పాత్ర పోషించింది. ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైన ఆర్టికల్ 370 సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

Article 370 OTT: ఓటీటీలోకి వివాదాస్పద మూవీ.. యామీ గౌతమ్ 'ఆర్టికల్ 370' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Article 370 Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 24, 2024 | 8:22 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయాలకు సంబంధించిన కొన్ని సినిమాలు విడుదల కావడం మామూలే. అలా కొద్ది రోజుల క్రితం ‘ఆర్టికల్ 370’ సినిమా విడుదలైంది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ కీలక పాత్ర పోషించింది. ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైన ఆర్టికల్ 370 సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మొదట్లో ఈ పొలిటికల్ డ్రామాకు ఓ మోస్తరు కలెక్షన్లు వచ్చాయి. అయితే ఆ తర్వాత మౌత్ టాక్ తో కలెక్షన్లు పెరిగాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో OTTలో ‘ఆర్టికల్ 370’ని చూడటానికి చాలా మంది ఎదురుచూస్తున్నారు. నివేదికల ప్రకారం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమా ఆర్టికల్ 370 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది .ఈ నేపథ్యంలో ఏప్రిల్ 19 న ఈ మూవీ OTTలో విడుదల కానుంది. హిందీతో పాటు తెలుగు ఇతర దక్షిణాది భాషల్లోనూ ఆర్టికల్ 370 సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.

ఆర్టికల్ 370 సినిమాలో యామీ గౌతమ్‌తో పాటు ప్రియమణి కూడా కీలక పాత్రలో నటించింది. నరేంద్ర మోడీ పాత్రను ప్రముఖ నటుడు అరుణ్ గోవిల్ పోషించారు. రాజ్ అరుణ్, శివమ్ ఖజూరియా, అరుణ్ గోవిల్, వైభవ్ తాత్వాడి, దివ్యా సేత్, సుమిత్ కౌల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే కొత్త సినిమాలను ప్రజలకు అందించడంలో OTT కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చే సినిమాలకు OTTలో కూడా భారీ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు ‘ఆర్టికల్ 370’ సినిమా కూడా OTTలో డిమాండ్‌లో ఉంది. కాబట్టి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించారు.

ఇవి కూడా చదవండి

వంద కోట్ల క్లబ్ లో ఆర్టికల్ 370

రాజ్ నాథ్ సింగ్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.