KKR vs SRH, IPL 2024: ఆల్‌రౌండ్ షోతో రఫ్పాడించిన రసెల్.. ఉత్కంఠ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి
ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా రైట్ నైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది. హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63, 8 సిక్సర్లు) తన మెరుపు ఇన్నింగ్స్ తో హైదరాబాద్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లినా చివరి ఓవర్ లో మ్యాచ్ తారుమారైంది. ఉత్కంఠగా జరిగిన ఈ హై స్కోర్ల మ్యాచ్ లో హైదరాబాద్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఈడెన్ గార్డెన్ వేదికగా కోల్ కతా రైట్ నైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది. హెన్రిచ్ క్లాసెన్ (29 బంతుల్లో 63, 8 సిక్సర్లు) తన మెరుపు ఇన్నింగ్స్ తో హైదరాబాద్ గెలుపు అంచుల వరకు తీసుకెళ్లినా చివరి ఓవర్ లో మ్యాచ్ తారుమారైంది. ఉత్కంఠగా జరిగిన ఈ హై స్కోర్ల మ్యాచ్ లో హైదరాబాద్ కేవలం 4 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 209 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ టీమ్ లో క్లాసెన్ మినహా మరెవరూ పెద్దగా పరుగులేమీ చేయలేదు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (32), అభిషేక్ శర్మ (32) రాణించినా మిడిలార్డర్ ప్లాఫ్ అయ్యింది. త్రిపాఠి (20), మర్కరమ్ (18), అబ్దుల్ సమద్ (15), షాబాజ్ అహ్మద్ (16) పెద్దగా పరుగులు చేయలేకపోవడంతో హైదరాబాద్ కు పరాజయం తప్పలేదు. కోల్ కతా బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు తీయగా, ఆండ్రీ రస్సెస్ 2 వికెట్లు తీశాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. టాపార్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిలైనా విండీస్ పించ్ హిట్టర్ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 7 భారీ సిక్సర్లు, 3 బౌండరీలతో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఫిలిఫ్ సాల్ట్ (40 బంతుల్లో 53, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటగా, రమణ్ దీప్ సింగ్ (35), రింకూ సింగ్ (23) చలవతో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఇక 209 పరుగుల లక్ష్య ఛేదనలో మయాంక్ అగర్వాల్, అభిషేక్ ఉపాధ్యాయ్ పవర్‌ప్లేలోనే 60 పరుగులు పూర్తి చేశారు. అయితే వీరిద్దరూ ఔటైన తర్వాత పరుగుల వేగం తగ్గిపోయింది. వరుసగా వికెట్ కూడా పడ్డాయి. మరోవైపు స్పిన్ త్రయం సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ హైదరాబాద్ బ్యాటర్లను కట్టడి చేశారు. 17వ ఓవర్ ఐదో బంతికి అబ్దుల్ సమద్ వికెట్ పడినప్పుడు స్కోరు 145 పరుగులు మాత్రమే. అయితే అక్కడి నుంచి క్లాసెన్ విధ్వంసం ప్రారంభమైంది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ తీసుకొచ్చినా హైదరాబాద్ ను గెలిపంచలేకపోయాడీ డ్యాషింగ్ బ్యాటర్.
మ్యాచ్ తారుమారైన క్షణం ఇదే.. వీడియో
A special effort to dismiss a special player 👏
Suyash Sharma, the game-changer in #KKRvSRH 🙌#IPLonJioCinema #TATAIPL #IPL2024 #JioCinemaSports pic.twitter.com/cF1pYJg8Tk
— JioCinema (@JioCinema) March 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..