KKR vs SRH: అయ్యారే అయ్యర్! డకౌట్‌గా వెనుదిరిగిన కోల్‌కతా కెప్టెన్.. మరీ ఇంత నిర్లక్ష్యంగానా! వీడియో

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 17వ సీజన్‌ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జట్టు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో శ్రేయాస్ అయ్యర్ బాధ్యతారహిత షాట్‌తో క్యాచ్ అవుట్ అయ్యాడు. తంగర్సు నటరాజన్ శ్రేయాస్‌ను అవుట్ చేసి, మ్యాచ్ నాలుగోనే ఓవర్‌లో కోల్ కతాను మరిన్ని కష్టాల్లోకి నెట్టాడు.

KKR vs SRH: అయ్యారే అయ్యర్! డకౌట్‌గా వెనుదిరిగిన కోల్‌కతా కెప్టెన్.. మరీ ఇంత నిర్లక్ష్యంగానా! వీడియో
KKR vs SRH
Follow us

|

Updated on: Mar 23, 2024 | 9:02 PM

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 17వ సీజన్‌ను నిరాశాజనకంగా ప్రారంభించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జట్టు కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో శ్రేయాస్ అయ్యర్ బాధ్యతారహిత షాట్‌తో క్యాచ్ అవుట్ అయ్యాడు. తంగర్సు నటరాజన్ శ్రేయాస్‌ను అవుట్ చేసి, మ్యాచ్ నాలుగోనే ఓవర్‌లో కోల్ కతాను మరిన్ని కష్టాల్లోకి నెట్టాడు. అంతకు ముందు నటరాజన్ వెంకటేష్ అయ్యర్ ను 7 పరుగుల వద్ద ఔట్ చేశాడు. వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ 16వ సీజన్‌లో ఆడలేకపోయాడు. కానీ శ్రేయస్ గాయాన్ని అధిగమించి 17వ సీజన్‌కు తిరిగి వచ్చాడు. జట్టు యాజమాన్యం కూడా నమ్మకంతో కెప్టెన్‌గా శ్రేయాస్‌ని కొనసాగించింది. సుమారు సంవత్సరం తర్వాత శ్రేయాస్ నుండి ఒక మెరుపు ఇన్నింగ్స్ వస్తుందనుకున్నారు. అయితే శ్రేయాస్ క్రికెట్ అభిమానులను నిరాశపరిచాడు. శ్రేయాస్ సున్నాకి అవుటయ్యాడు. అది కేకేఆర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతకు ముందు హైదరాబాద్ టాస్ గెలిచి కేకేఆర్‌ని బ్యాటింగ్‌కు ఆదేశించింది. ఓపెనింగ్ జోడీ ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్ రంగంలోకి దిగారు. ఫిలిప్ ఆరంభం నుంచే ఎస్ ఆర్ హెచ్ బౌలర్లపై విరుచుకు పడ్డాడు. రెండో ఓవర్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఫిలిప్ వరుసగా 3 సిక్సర్లు బాదాడు. కానీ తర్వాతి బంతికే సునీల్ నరైన్ నాన్ స్ట్రైక్ ఎండ్‌లో బాధ్యతా రహితంగా రనౌట్ అయ్యాడు. నరైన్ 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి కోల్ కతా నైట్ రైడర్స్ స్కోరు 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు. రింకూ సింగ్ (7 బంతుల్లో 10), ఆండ్రీ రస్సెల్ ( 9 బంతుల్లో 14) క్రీజులో ఉన్నారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2 వికెట్లు తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ ఎలెవన్:

పాట్ కమిన్స్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐదాన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.

కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

వెంట వెంటనే మూడు వికెట్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..