MS Dhoni: కెప్టెన్‌గా ముగిసిన ధోని శకం.. ఐపీఎల్‌లో మిస్టర్ కూల్ రికార్డులివే.. బ్రేక్ చేయడం కష్టమే గురూ!

ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు మిస్టర్ కూల్ ఎం ఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ బ్యాటర్‌ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టాడు.

MS Dhoni: కెప్టెన్‌గా ముగిసిన ధోని శకం.. ఐపీఎల్‌లో మిస్టర్ కూల్ రికార్డులివే.. బ్రేక్ చేయడం కష్టమే గురూ!
MS Dhoni
Follow us
Basha Shek

|

Updated on: Mar 21, 2024 | 6:56 PM

ప్రతిష్ఠాత్మక ఐపీఎల్ 17వ ఎడిషన్ ప్రారంభానికి ఒక రోజు ముందు మిస్టర్ కూల్ ఎం ఎస్ ధోని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ బ్యాటర్‌ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ధోనీ 2008 నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వంలో, CSK రెండు ఛాంపియన్స్ లీగ్ టైటిళ్లతో సహా 5 IPL ట్రోఫీలను గెలుచుకుంది. టీ20 ఫార్మాట్‌లో ధోనీ ఎలాంటి నాయకుడో ఈ గణాంకాలు రుజువు చేస్తున్నాయి. అత్యధిక టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆటగాడిగా కూడా ధోనీ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 322 మ్యాచ్‌ల్లో ధోనీ తన జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ 322 మ్యాచ్‌ల్లో 189 మ్యాచ్‌లు జట్టును విజయపథంలో నడిపించిన ఘనత ధోనీకి దక్కింది. అంతేకాదు అత్యధికంగా 9 ఫైనల్స్‌ గెలిచిన కెప్టెన్‌గా కూడా ధోని నిలిచాడు. 2007 T20 ప్రపంచకప్, 2016 ఆసియాకప్‌లను గెలుచుకున్న సందర్భాల్లో కూడా ధోని భారత T20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

ఇక ఐపీఎల్‌కి విషయానికి వస్తే… రెండేళ్ల నిషేధం మినహా 14 ఏళ్లలో 212 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు. అలాగే ఛాంపియన్స్ లీగ్‌లో 23 మ్యాచ్‌లలో జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ 235 మ్యాచ్‌ల్లో చెన్నై 142 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 90 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అలాగే రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగియగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. అంటే చెన్నై జట్టు కెప్టెన్‌గా ధోనీ సాధించిన విజయాల శాతం 60.42. ఐపీఎల్‌లో 14 సీజన్లకు మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో ఆ జట్టు 12 సార్లు ప్లే ఆఫ్‌కు చేరుకుంది. 2020, 2022లో మాత్రమే జట్టు ప్లేఆఫ్స్‌ కు చేరుకోవడంలో విఫలమైంది. అదే సమయంలో ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఐపీఎల్ లో గ్రేటెస్ట్ కెప్టెన్ గురూ..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..