AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Game Changer: రామ్ చరణ్ రేంజ్ అలాంటిది మరి.. రికార్డు ధరకు గేమ్ ఛేంజర్‌ ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ . షూటింగ్ పూర్తి కాకుండానే ఈ సినిమా OTT ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. ఈ సినిమా OTT ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అమెజాన్ ఓటీటీనే స్వయంగా వెల్లడించింది

Game Changer: రామ్ చరణ్ రేంజ్ అలాంటిది మరి.. రికార్డు ధరకు గేమ్ ఛేంజర్‌ ఓటీటీ రైట్స్.. ఎన్ని కోట్లో తెలుసా?
Ram Charan Game Changer
Basha Shek
|

Updated on: Mar 20, 2024 | 8:47 PM

Share

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’ . షూటింగ్ పూర్తి కాకుండానే ఈ సినిమా OTT ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. ఈ సినిమా OTT ప్రసార హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని అమెజాన్ ఓటీటీనే స్వయంగా వెల్లడించింది. గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీ రైట్స్ కోసం రికార్డు స్థాయిలో ఏకంగా 105 కోట్లకు డీల్ కుదిరినట్లు సమాచారం. ఈ వార్త విన్న రామ్ చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సౌతిండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ తో శంకర్ జత కట్టడంతో ఈ సినిమాపై అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఎన్నికలు, రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని టాక్. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడని ఇటీవల రిలీజైన పోస్టర్లు చెప్పకనే చెప్పేశాయి. అలాగే ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం OTT కంపెనీల మధ్య విపరీతమైన పోటీ ఉంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు సొంతం చేసుకోవడానికి ఈ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ముందుగానే గేమ్ ఛేంజర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో విడుదలైన కొన్ని నెలల తర్వాత ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ గేమ్ ఛేంజర్ ఓటీటీ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనుంది. కాగా ‘RRR’ సినిమా తర్వాత రామ్ చరణ్ డిమాండ్ పెరిగింది. ఆయన నటిస్తున్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొనడంతో ఓటీటీ రైట్స్ కొనుగోలుకు పోటీ పెరిగింది. ఇందులో భాగంగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా OTT ప్రసార హక్కులను రికార్డు ధరకు ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ సొంతం చేసుకుందని టాక్.

అమెజాన్ చేతికి గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులు..

RC 16 ప్రారంభం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?