Guntur Kaaram: ‘మహేశ్, శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టారు’ గుంటూరు కారం సాంగ్‌కు స్టార్ క్రికెటర్ ఫిదా.. వీడియో

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. అందాల భామ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన గుంటూర కారం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది

Guntur Kaaram: 'మహేశ్, శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టారు' గుంటూరు కారం సాంగ్‌కు స్టార్ క్రికెటర్ ఫిదా.. వీడియో
Guntur Karaam Song
Follow us
Basha Shek

|

Updated on: Mar 19, 2024 | 9:02 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం. అందాల భామ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో రిలీజైన గుంటూర కారం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఇందులోని కుర్చీని మడత పెట్టి సాంగ్ మాత్రం అభిమానులను ఒక ఊపు ఊపేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఎనర్జీతో మహేశ్ ఈ పాటకు స్టెప్పులేయడం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇక శ్రీలీల డ్యాన్స్ గురించి చెప్పదేముంది. అదే సినిమాలో మహేశ్ బాబు అన్నట్లే లేడీ ప్రభుదేవాలా తన డ్యాన్స్ తో అదరగొట్టిందీ ముద్దుగుమ్మ. యూట్యూబ్‌ లోనూ కుర్చీ మడత పెట్టి సాంగ్ కు మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలోనూ ఈ సూపర్ పాటకు రీల్స్, రీక్రియేషన్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు కారం కుర్చీ మడత పెట్టి సాంగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవి చంద్రన్ అశ్విన్. సినిమాలో మహేశ్, శ్రీలీల హుషారెత్తించే స్టెప్పులకు తాను ఫిదా అయ్యానని చెప్పుకొచ్చాడీ స్పిన్ లెజెండ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఓ అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్ ను ప్రస్తావించాడు అశ్విన్. ‘మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్‌లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్‌ భయంకరంగా ఉంది. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్‌కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్‌ టైప్‌ చూడండి. మహేశ్‌ బాబు ఎక్స్‌ట్రార్డినరీ డ్యాన్సర్‌. ఇక శ్రీలీల అదరగొట్టింది. కుర్చీ మడత పెట్టి సాంగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు మంచి ఊపు తీసుకొస్తుంది’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన మహేశ్ అభిమానులు, నెటిజన్లు తెగ ఖుషీ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

రవి చంద్రన్ అశ్విన్ ప్రశంసలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!