Guess The Actor: సినిమా కోసం 30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిపోయిన స్టార్ నటుడు.. ఎవరో గుర్తుపట్టారా?

పై ఫొటోలో బక్కచిక్కిపోయి అస్థిపంజరంల కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా? అతను ఓ స్టార్ నటుడు. ఇక్కడ నటుడు ఎందుకంటున్నామంటే హీరో కొన్ని పాత్రలు మాత్రమే చేయగలడు. నటుడు అన్ని రోల్స్ చేస్తాడు. పై ఫొటోలో ఉన్నది బాలీవుడ్ లో ఫేమస్ యాక్టర్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెర్సటైల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Guess The Actor: సినిమా కోసం 30 కిలోలు తగ్గిపోయి అస్తిపంజరంలా మారిపోయిన స్టార్ నటుడు.. ఎవరో గుర్తుపట్టారా?
Guess The Actor
Follow us
Basha Shek

|

Updated on: Mar 19, 2024 | 8:15 AM

పై ఫొటోలో బక్కచిక్కిపోయి అస్థిపంజరంల కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా? అతను ఓ స్టార్ నటుడు. ఇక్కడ నటుడు ఎందుకంటున్నామంటే హీరో కొన్ని పాత్రలు మాత్రమే చేయగలడు. నటుడు అన్ని రోల్స్ చేస్తాడు. పై ఫొటోలో ఉన్నది బాలీవుడ్ లో ఫేమస్ యాక్టర్. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెర్సటైల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమా కోసం ప్రాణం పెట్టి నటించే అతను అందుకోసం ఏమైనా చేస్తాను. తనను ఎలాగైనా మార్చుకుంటాడు. ఇప్పుడు కూడా తన తర్వాతి సినిమా కోసం ఏకంగా 30 కిలోల బరువు తగ్గిపోయాడు. అస్థిపంజరంలా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ అతను మరెవరో కాదు బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ రణ్ దీప్ హుడా. స్వాతంత్ర్య సమర యోధుడు వీర సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు రణ్ దీప్‌. అంతేకాదు దర్శకత్వ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వినాయక్ దామోదర్ సావర్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది . అందుకే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రణదీప్ హుడా ఈ సినిమాలో సావర్కర్ పాత్రను పోషించాడు . ఆ పాత్రకు ఉన్న గౌరవం, నిబద్ధత కోసం రణదీప్ హుడా ఇలా మారిపోయాడు. ప్రస్తుతం అతని లుక్ ను చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ సినిమా మార్చి 22న విడుదల కానుంది. టీమ్ మొత్తం ప్రచారంలో బిజీగా ఉంది. సినిమా విడుదలకు మరికొద్ది రోజులు మిగిలి ఉండగానే రణదీప్ హుడా ఓ ఫోటోను షేర్ చేశాడు. ఇందులో అతనిని గుర్తించడం కష్టం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కండలు తిరిగిన దేహంతో ఉండే రణదీప్ హుడా సావర్కర్ పాత్ర కోసం కాస్త స్లిమ్ అయ్యాడు. అతను దాదాపు 30 కిలోల శరీర బరువు తగ్గాడు. థొరాక్స్ ఎముకలు కనిపించే విధంగా పోజులిచ్చాడు. అతని కమిట్‌మెంట్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఏ హాలీవుడ్ హీరోకు తక్కువ కాదంటూ కొనియాడుతున్నారు. వైరల్‌గా మారిన ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో రణదీప్ హుడాతో పాటు నటి అంకితా లోఖండే కూడా కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా హిందీలోనే కాకుండా మరాఠీలో కూడా మార్చి 22న విడుదల కానుంది. మహాత్మా గాంధీ, బాల గంగాధర తిలక్, డా. బి.ఆర్. అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, జవహర్ లాల్ నెహ్రూ, మదన్ లాల్ ధింగ్రా, భగత్ సింగ్ వంటి అనేకమంది స్వాతంత్ర్య సమరయోధుల పాత్రలు ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ సినిమాలో కనిపించనున్నాయి.

ఇవి కూడా చదవండి

రణ్ దీప్ హుడా ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!