IPL 2024: 16 సీజన్లు.. 15 మంది కెప్టెన్లు.. అయినా అందని ద్రాక్షగానే ఐపీఎల్ కప్‌.. అన్ లక్కీయెస్ట్ టీమ్ ఏదంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్   ప్రారంభమై సరిగ్గా 16 ఏళ్లు గడిచాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌కు చాలా మంది ఆటగాళ్లు వచ్చి వెళ్లిపోయారు. 8 జట్లతో మొదలైన లీగ్ ఆ తర్వాత 10 జట్ల మధ్య పోరుగా మారింది. కాగా గత 16 సీజన్లలో ఒక జట్టు  ఏకంగా 15 సార్లు తమ కెప్టెన్‌ని మార్చింది

IPL 2024: 16 సీజన్లు.. 15 మంది కెప్టెన్లు.. అయినా అందని ద్రాక్షగానే ఐపీఎల్ కప్‌.. అన్ లక్కీయెస్ట్ టీమ్ ఏదంటే?
IPL 2024
Follow us
Basha Shek

|

Updated on: Mar 17, 2024 | 1:18 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 ప్రారంభానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌తో ఐపీఎల్ సీజన్ 17 అధికారికంగా ప్రారంభం కానుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్   ప్రారంభమై సరిగ్గా 16 ఏళ్లు గడిచాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్‌కు చాలా మంది ఆటగాళ్లు వచ్చి వెళ్లిపోయారు. 8 జట్లతో మొదలైన లీగ్ ఆ తర్వాత 10 జట్ల మధ్య పోరుగా మారింది. కాగా గత 16 సీజన్లలో ఒక జట్టు  ఏకంగా 15 సార్లు తమ కెప్టెన్‌ని మార్చింది అంటే నమ్ముతారా? ఇది నమ్మాల్సిందే…ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోఇది కూడా ఓ రికార్డే మరి. పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) జట్టుకు ఇప్పటివరకు 15 మంది కెప్టెన్లు నాయకత్వం వహించారు. అయితే ఇంతవరకూ ఒక్క ట్రోఫీని గెలవకపోవడం గమనార్హం. మరి పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్లు ఎవరో చూద్దాం రండి.

యువరాజ్ సింగ్

యువరాజ్ సింగ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి మొదటి కెప్టెన్. 2008, 2009 సీజన్లలో యువీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. యువరాజ్ సింగ్ కెప్టెన్సీలో పంజాబ్ 29 మ్యాచ్‌లు ఆడింది. అందులో 17 మ్యాచ్‌లు గెలవగా, 12 ఓడింది.

ఇవి కూడా చదవండి

కుమార సంగక్కర

శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర పంజాబ్ కింగ్స్ రెండో కెప్టెన్. ఐపీఎల్ 2010లో పంజాబ్ జట్టుకు 13 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. కేవలం 3 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

మహేల జయవర్ధనే

2010లో సంగక్కర కెప్టెన్సీలో వరుస పరాజయాలతో విలవిలలాడుతున్న పంజాబ్ ఫ్రాంచైజీ, మరో శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనేని ఎంపిక చేసింది. అయితే ఇతని కెప్టెన్సీ కూడా పంజాబ్ ను కూడా పరాజయాల బాట నుంచి గట్టెక్కించలేకపోయింది.

ఆడమ్ గిల్‌క్రిస్ట్

ఆడమ్ గిల్‌క్రిస్ట్ పంజాబ్ జట్టుకు నాల్గవ కెప్టెన్‌. ఐపీఎల్ 2011 నుంచి 2013 వరకు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు గిల్ క్రిస్ట్‌. ఈ సమయంలో పంజాబ్ జట్టును 34 మ్యాచ్‌ల్లో 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

డేవిడ్ హస్సీ

గిల్‌క్రిస్ట్ తప్పుకోవడంతో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ హస్సీ 2012, 2013 సీజన్లలో మొత్తం 12 మ్యాచ్‌లలో పంజాబ్‌కు నాయకత్వం వహించాడు.

జార్జ్ బెయిలీ

ఆస్ట్రేలియన్ జార్జ్ బెయిలీ పంజాబ్ కింగ్స్ జట్టుకు 6వ కెప్టెన్‌. IPL 2014, 2015లో, బెయిలీ సారథిగా వ్యవహరించాడు. మొత్తం 35 మ్యాచ్‌లలో 18 విజయాలు సాధించింది. జార్జ్ బెయిలీ సారథ్యంలో పంజాబ్ ఐపీఎల్ 2014లో తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది.

వీరేంద్ర సెహ్వాగ్

జార్జ్ బెయిలీ తప్పుకోవడంతో IPL 2015లో వీరేంద్ర సెహ్వాగ్ కూడా పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా పగ్గాలు స్వీకరించాడు.

వీరితో పాటు

డేవిడ్ మిల్లర్, మురళీ విజయ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆర్. అశ్విన్, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్‌, శిఖర్ ధావన్, సామ్ కర్రాన్ కూడా పంజాబ్ జట్టుకు నేతృత్వం వహించిన ఆటగాళ్లే..

శిఖర్ ధావన్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ 17లో పంజాబ్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈసారి కూడా పంజాబ్ జట్టు రాణించలేకపోతే 16వ కెప్టెన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..