WPL 2024: ఎల్లీస్ పెర్రీ ‘గ్లాస్ బ్రేకింగ్’ ఇన్నింగ్స్..స్పెషల్ గిఫ్ట్ అందజేసిన టాటా కంపెనీ.. ఫొటోస్ వైరల్
ఆదివారం (మార్చి 17) జరిగే ఫైనల్ పోరులో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టుతో తలపడనుంది. ఇదిలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీకి టాటా కంపెనీ ప్రత్యేక బహుమతిని అందజేసింది.
మహిళల ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్‌లోకి ప్రవేశించాయి. ఆదివారం (మార్చి 17) జరిగే ఫైనల్ పోరులో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ జట్టుతో తలపడనుంది. ఇదిలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీకి టాటా కంపెనీ ప్రత్యేక బహుమతిని అందజేసింది. అది కూడా పగిలిన గాజు గ్లాసు ను స్పెషల్ గా ప్యాక్ చేసి మరీ బహుమతిగా అందించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వివరాల్లోకి మార్చి 4న చిన్నస్వామి స్టేడియంలో యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ భారీ సిక్సర్ కొట్టింది. లాంగ్ ఆన్ కొట్టిన ఈ బంతి నేరుగా బౌండరీ లైన్ దగ్గర పార్క్ చేసిన టాటా కారు విండో గ్లాస్ ను బద్దలు కొట్టింది. 80 మీటర్ల మేర టాటా కారు కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఇప్పుడు టాటా కంపెనీ అదే గాజును ఎల్లిస్ పెర్రీకి ఫ్రేమ్‌లో ప్యాక్ చేసి స్పెషల్ బహుమతిగా ఇచ్చింది టాటా. తద్వారా పెర్రీ మెరుపు ఇన్నింగ్స్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చింది టాటా కంపెనీ..
ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఎల్లిస్ పెర్రీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. లీగ్ దశలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్లు తీసిన పెర్రీ.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించింది. ఆమె కారణంగానే మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఆర్‌సీబీ జట్టు మొదటిసారి ఫైనల్‌కు చేరుకుంది.
అదే కార్ గ్లాస్ ను ప్రత్యేకంగా..
Incredible actions turned into accolades, yet again 👏#PlayBold #ನಮ್ಮRCB #SheIsBold #WPL2024 #MIvRCB pic.twitter.com/TsdSzTcfI4
— Royal Challengers Bangalore (@RCBTweets) March 16, 2024
ఎల్లీస్ పెర్రీ ‘గ్లాస్ బ్రేకింగ్’ ఇన్నింగ్స్… వీడియో ఇదిగో,.,.
𝘽𝙧𝙚𝙖𝙠𝙞𝙣𝙜 𝙍𝙚𝙘𝙤𝙧𝙙𝙨 + 𝙂𝙡𝙖𝙨𝙨𝙚𝙨 😉
Ellyse Perry’s powerful shot shattered the window of display car 😅#TATAWPL #UPWvRCB #TATAWPLonJioCinema #TATAWPLonSports18 #HarZubaanParNaamTera#JioCinemaSports #CheerTheW pic.twitter.com/RrQChEzQCo
— JioCinema (@JioCinema) March 4, 2024
The girls believed, they manifested, and they made it to the final of #WPL2024. Sensational effort to successfully defending the lowest score in the two years of #WPL, that too against the defending champions Mumbai. Find out what emotions the players were going through in the… pic.twitter.com/Wx6zCzMgCZ
— Royal Challengers Bangalore (@RCBTweets) March 16, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..