AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: భర్త రణ్‌బీర్ కపూర్ కంటే అలియానే ధనవంతురాలు.. మొత్తం ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?

తండ్రి మహేశ్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోందీ సొగసరి

Alia Bhatt: భర్త రణ్‌బీర్ కపూర్ కంటే అలియానే ధనవంతురాలు.. మొత్తం ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా?
Alia Bhatt Family
Basha Shek
|

Updated on: Mar 15, 2024 | 9:59 AM

Share

బాలీవుడ్ అందాల తార అలియా భట్‌ పుట్టిన రోజు ఇవాళ (మార్చి 15). దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తండ్రి మహేశ్ భట్ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అలియా అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోందీ సొగసరి. ఇలా సినిమాలు, ప్రకటనలతో బాగానే ఆదాయం ఆర్జిస్తోంది అలియా భట్‌. ఈ నేపథ్యంలో ఆమె భర్త, స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ కంటే అలియాకే ఎక్కువ ఆస్తులున్నాయని తెలుస్తోంది. కొన్ని నివేదిల ప్రకారం రణబీర్ కపూర్, అలియా భట్ మొత్తం ఆస్తుల విలువ 885 కోట్లు. ఇందులో అలియా భట్ ఆస్తులే 520 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇక రణబీర్ కపూర్ కు 365 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని సమాచారం. అలియాతో పెళ్లయ్యాక రణ్‌బీర్‌ కపూర్‌ వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. అతని ఆస్తులు కూడా భారీగా పెరుగుతున్నాయి.

ఇక అలియా భట్ ఒక్కో సినిమాకు కనీసం 15-18 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. భారతదేశంలో ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకునే హీరోయిన్లు చాలా అరుదు. 2021లో భారతదేశంలోని టాప్ 6 అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అలియాకు చోటు దక్కింది. సినిమాల సంగతి పక్కన పెడితే లేస్, ఫ్రూటీ, డ్యూరోఫ్లెక్స్, మాన్యవర్, మేక్ మై ట్రిప్, ఫ్లిప్‌కార్ట్ వంటి టాప్ బ్రాండ్లకు ప్రమోటర్ గా వ్యవహరిస్తోందీ సొగసరి. ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు రూ.2 కోట్లు తీసుకుంటుందని టాక్. ఇవి కాకుండా అలియా భట్‌కి బాంద్రాలో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని ధర 32 కోట్ల రూపాయలు. ఇక తన ప్రొడక్షన్ కంపెనీ ఆఫీస్ కోసం రూ.2 కోట్లతో స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది . లండన్ లోనూ ఆమెకు ఇల్లు ఉంది. అలాగే రోవర్ రేంజ్ రోవర్ వోగ్ (రూ. 2 కోట్లు), బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ (రూ. 1.76 కోట్లు) వంటి లగ్జరీ కార్లు అలియా భట్ గ్యారేజ్ లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై మళ్లీ జంటగా అలియా, రణ్ బీర్ కపూర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బుసలుకొట్టే విషపూరిత పాములను ఒంటెలతో ఎందుకు తినిపిస్తారు?
బుసలుకొట్టే విషపూరిత పాములను ఒంటెలతో ఎందుకు తినిపిస్తారు?
CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. ఆ 3 భాషలు నేర్చుకోవాల్సిందే!
CBSE త్రిభాషా విధానం కొత్త రూల్స్.. ఆ 3 భాషలు నేర్చుకోవాల్సిందే!
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
ఆ స్టార్ హీరో ఆ అమ్మాయి చావు బ్రతుకుల నుంచి కాపాడాడు..
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
అయోధ్య కానుకల వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
మెట్ల కింద టాయిలెట్ కడుతున్నారా? ముందు ఈ వాస్తు రూల్స్ తెలుసుకో..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
వెండి ఆభరణాలు నల్లబడితే అపశకునమా..? దీని వెనుకున్న సైన్స్..
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
సహాయం చేసినవారిని కాలం మర్చిపోదు.. మాయా చాప నీతి కథ
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఇలాంటోళ్లతో మా గడ్డపై అడుగుపెడితే.. ఇంగ్లాండ్ మాజీల ట్రోల్స్..
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. కేంద్ర ప్రభుత్వం మరో అప్డేట్
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..
షార్ట్ వీడియో.. బిగ్‌ ప్రాబ్లమ్స్‌.. చూడడం తగ్గించకపోతే..