Producer SKN: చావు బతుకుల మధ్య ఎన్టీఆర్ అభిమాని.. ఆర్థిక సాయం అందించిన బేబీ నిర్మాత

ఇటీవల అమలాపురానికి చెందిన పవన్ కృష్ణ అనే తారక్ అభిమాని రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు. అయితే సదరు అభిమాని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. దీంతో తోటి అభిమానులు పవన్ కు సాయమందించేందుకు ముందుకొచ్చారు.

Producer SKN: చావు బతుకుల మధ్య ఎన్టీఆర్ అభిమాని.. ఆర్థిక సాయం అందించిన బేబీ నిర్మాత
Producer SKN
Follow us

|

Updated on: Mar 14, 2024 | 4:34 PM

‘బేబి’ నిర్మాత ఎస్‌ కే ఎన్ (శ్రీనివాస కుమార్) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. గతంలో పలువురికి ఎన్నో రకాలుగా సాయమందించిన ఆయన ఈసారి ఎన్టీఆర్ అభిమానికి తన వంతు ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల అమలాపురానికి చెందిన పవన్ కృష్ణ అనే తారక్ అభిమాని రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు సూచించారు. అయితే సదరు అభిమాని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. దీంతో తోటి అభిమానులు పవన్ కు సాయమందించేందుకు ముందుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా చికిత్సకు అవసరమయ్యే మొత్తాన్ని సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ నిర్మాత ఎస్‌ కే ఎన్ వరకు చేరింది. వెంటనే స్పందించిన ఆయన ఎన్టీఆర్ అభిమానికి అండగా నిలిచారు. పవన్ వైద్య ఖర్చుల నిమిత్తం వెంటనే రూ. 50 వేలు పంపించారు. ‘నా వంతు సాయం చేశాను. తారక్ గారి అభిమాని త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మిగతా వారు కూడా స్పందించి పవన్ కు సాయం చేయాలి’ అని తెలిపారు ఎస్కేఎన్.  ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎస్‌కేఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్కేఎన్ లాగే మరికొందరు దాతలు, మిగతా సెలబ్రిటీలు స్పందించాలంటూ కోరుతున్నారు.

గతంలోనూ..

బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ సాయమందించడం ఇదేమి మొదటి సారి కాదు. గతంలో కూతురి పెళ్లి కోసం దాచిన డబ్బుకు చెదలు పట్టడంతో పార్వతి పురం మన్యం జిల్లా కు చెందిన ఓ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందించారు. అంతకు ముందు కూడా అవసరంలో ఉన్న పలువురికి ఇలాగే డబ్బులు సాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారీ ప్రొడ్యూసర్.

ఇవి కూడా చదవండి

రూ. 50వేలు పంపిన ఎస్ కే ఎన్..

అప్పుడు కూతురి పెళ్లికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి