AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatra 2 OTT: ఓటీటీలో సీఎం జగన్ బయోపిక్‌.. ‘యాత్ర 2’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

పొలిటికల్‌ డ్రామా గా తెరకెక్కిన యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించి మెప్పించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర 2 సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది

Yatra 2 OTT: ఓటీటీలో సీఎం జగన్ బయోపిక్‌.. 'యాత్ర 2' స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Yatra 2 Movie
Basha Shek
|

Updated on: Mar 13, 2024 | 3:59 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా మహి. వి. రాఘవ్ తెరకెక్కించిన సినిమా యాత్ర 2. సుమారు ఐదేళ్ల క్రితం వచ్చిన మమ్ముట్టి యాత్ర 1 సినిమాకు సీక్వెల్ ఇది. పొలిటికల్‌ డ్రామా గా తెరకెక్కిన యాత్ర 2 సినిమాలో జగన్ పాత్రలో తమిళ హీరో జీవా జీవించాడు. జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ పాత్రలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి నటించి మెప్పించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో భారీ అంచనాలతో ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదలైన యాత్ర 2 సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. యాత్ర 1 తో పోలిక రావడంతో యాత్ర 2పై అంచనాలు మరీ ఎక్కువయ్యాయి. దీంతో ఈ పొలిటికల్ డ్రామా కేవలం ఒక మోస్తరు వసూళ్లతోనే సరిపెట్టుకుంది. ఎలాంటి కాంట్రవర్సీలకు చోటివ్వకుండా కేవలం సీఎం జగన్ జీవితంలోని ఆసక్తికర అంశాలను స్పృశిస్తూ యాత్ర 2 ను తెరకెక్కించిన విధానం సినిమా ప్రియులను ఆకట్టుకుంది. మొత్తానికి థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన యాత్ర 2 త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌ వీడియో సీఎం జగన్‌ బయోపిక్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి యాత్ర 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా మొదట మహా శివరాత్రి కానుకగా మార్చి 8న యాత్ర 2 సినిమాను ఓటీటీలోకి వస్తుందని చాలామంది భావించారు. అయితే అదేమీ జరగలేదు. అయితే మార్చి 15 న లేదా 16వ తేదీల్లో యాత్ర 2 స్ట్రీమింగ్ కు వస్తుందని తెలుస్తోంది. యాత్ర 2 సినిమాలో జగన్ సతీమణి వైఎస్ భారతి పాత్రలో కేతకీ నారాయణన్ నటించింది. అలాగే చంద్రాబాబు పాత్రలో మహేశ్ మంజ్రేకర్, సోనియా గాంధీ రోల్‌లో సుజానే బెర్నెట్‌ ఆకట్టుకున్నారు. వీరితో పాటు శుభలేఖ సుధాకర్‌, జార్జ్ మరియన్‌, రాజీవ్‌ కుమార్ అనేజా తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన యాత్ర 2 సినిమాకు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకూర్చారు. శ్రవణ్ కటికనేని ఎడిటర్‌ గా వ్యవహరించగా, మధి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

యాత్ర 2 సినిమా మేకింగ్ వీడియో..

యాత్ర 2 బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..
అతడు పెద్ద హీరో.. కానీ నాతో ఆ మాట చెప్పడంతో షాకయ్యా..