AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar Awards 2024: ఆర్ఆర్ఆర్‌ను మర్చిపోని ఆస్కార్.. మరోసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు నాటు’ స్టెప్పులు.. వీడియో

ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ససోమవారం (మార్చి 11) అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఇదే ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాను మరోసారి గుర్తుకుచేసుకున్నారు ఆస్కార్ నిర్వాహకులు.

Oscar Awards 2024: ఆర్ఆర్ఆర్‌ను మర్చిపోని ఆస్కార్.. మరోసారి రామ్ చరణ్, ఎన్టీఆర్ 'నాటు నాటు' స్టెప్పులు.. వీడియో
RRR Movie
Basha Shek
|

Updated on: Mar 11, 2024 | 1:36 PM

Share

ప్రతిష్ఠాత్మక 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ససోమవారం (మార్చి 11) అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగింది. జిమ్మీ కిమ్మెల్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఇదే ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమాను మరోసారి గుర్తుకుచేసుకున్నారు ఆస్కార్ నిర్వాహకులు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు భారతదేశానికి గర్వకారణమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి టీమ్‌కి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు . కాగా 2022లో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకు గతేడాది ఆస్కార్‌ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఇదే ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకున్న క్షణాలు ఇప్పటికీ మన కళ్ల ముందు మెదులుతూనే ఉన్నాయి.

అయితే ఈసారి అస్కార్ అవార్డుల్లో మన ఇండియా నుంచి ఏ సినిమా కూడా నామినేషన్స్ లో నిలవలేదు. దీంతో భారతీయ సినిమా ప్రేక్షకులు కొద్దిగా నిరాశకు లోనయ్యారు. అయితే ఇదే ఆస్కార్ మన ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం మరవలేకపోతోంది. తాజాగా ఇదే వేదికపై స్ట్సంట్స్ కు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ప్లే చేశారు. అందులో ఆర్ఆర్ఆర్ సినిమాలోని రెండు యాక్షన్ షాట్స్ ని కూడా చూపించడం విశేషం. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వేసిన నాటు నాటు స్టెప్పు కూడా స్టేజ్ వెనకాలు చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ సినిమా చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఆస్కార్ తో పాటు ఆర్ఆర్ఆర్ కూడా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఆర్ ఆర్ ఆర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?