- Telugu News Photo Gallery This is the latest update of 'Matka', the mega hero who is taking risks for the role
Mega Hero: ఆ పాత్ర కోసం రిస్క్ చేస్తున్న మెగా హీరో.. ‘మట్కా’ లేటెస్ట్ అప్డేట్ ఇదే
సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గతంలో గద్దలకొండ గణేశ్ మూవీ కోసం పూర్తిగా రఫ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మట్కా కోసం కోసం వెరైటీ గెటప్స్ లో నటించేందుకు సిద్దమవుతున్నాడు.
Updated on: Mar 11, 2024 | 4:04 PM

మెగా హీరో వరుణ్ తేజ్ టాలెంటెడ్ డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో 'మట్కా' మూడో షెడ్యూల్ ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. "ఆపరేషన్ వాలెంటైన్" రిలీజ్ కి ముందే జరిగిన ఈ సినిమా షూటింగ్ కారణంగా హీరో తన జుట్టు, గడ్డం పెంచుకుని సినిమాను రీస్టార్ట్ చేశాడు.

వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో వరుణ్ తేజ్ 20, 30, 50 ఏళ్ల వయసున్న మూడు డిఫరెంట్ టైమ్ లైన్స్ లో కనిపించే పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. 50 ఏళ్ల వృద్ధుడి పాత్ర కోసం ఆయన నిజంగా లావుగా కనిపించేలా ప్రొస్థెటిక్స్ వాడకుండా బరువు పెరుగుతుండటం హైలైట్

ఇదే కారణంతో వరుణ్ మరో షెడ్యూల్ తర్వాత గ్యాప్ తీసుకుని బోలెడంత ఆహారం తినడం ద్వారా తన బాడీని పెంచుకునే అవకాశం ఉంది. ఇది కఠినమైన సవాలు అని చెప్పాలి. ఏదేమైనా వరుణ్ మంచి విజయం సాధించాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దంగల్ సినిమాలో సిక్స్ ప్యాక్ ఫిజిక్ అమీర్ ఖాన్ అదరగొడుతాడు. ఆ తర్వాత బరువు పెరుగుతాడు. ఈ మెగా హీరో కూడా రియల్ స్టంట్ కోసం రెడీ అవుతున్నాడు.. అయితే ఎలా ఉంటాడు అనేది వేచి చూడాల్సిందే.

సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. గతంలో గద్దలకొండ గణేశ్ మూవీ కోసం పూర్తిగా రఫ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మట్కా కోసం కోసం వెరైటీ గెటప్స్ లో నటించేందుకు సిద్దమవుతున్నాడు.



