Parineeti Chopra: తల్లి కానున్న హీరోయిన్ పరిణీతి చోప్రా! అందుకే అలా! నెట్టింట వైరల్ వీడియో

విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే దీపికా పదుకొణె , రణ్‌వీర్‌ సింగ్‌లు త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అలాగే మరో అందాల తార కత్రినా కైఫ్ కూడా గర్భంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ జాబితాలో మరో ముద్దుగుమ్మ చేరింది.

Parineeti Chopra: తల్లి కానున్న హీరోయిన్ పరిణీతి చోప్రా! అందుకే అలా! నెట్టింట వైరల్ వీడియో
Parineeti Chopra
Follow us
Basha Shek

|

Updated on: Mar 10, 2024 | 2:13 PM

ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు శుభవార్తలు చెప్పారు. విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్కా శర్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే దీపికా పదుకొణె , రణ్‌వీర్‌ సింగ్‌లు త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అలాగే మరో అందాల తార కత్రినా కైఫ్ కూడా గర్భంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పుడీ జాబితాలో మరో ముద్దుగుమ్మ చేరింది. ఆమె మరెవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా సోదరి పరిణీతి చోప్రా. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో కలిసి గతేడాది పెళ్లిపీటలెక్కిందీ అందాల తార. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు పరిణీతి, రాఘవ్ ల వివాహానికి హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలయ్యాయి. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఎయిర్‌పోర్టులో వదులుగా ఉండే డ్రెస్‌లో కనిపించింది పరిణీతి. దీంతో ఆమె గర్భంతో ఉందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమె ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదని అంటున్నారు.

వివాహం తర్వాత కెమెరాకు దూరంగా ఉన్న పరిణీతి చోప్రా మళ్లీ ఇప్పుడు తన పనిపై దృష్టి పెడుతోంది. చాలా సినిమాల్లో నటిస్తూ బిజిబిజీగా ఉంటోంది. వీటితో పాటు పలు బ్రాండ్‌ల ప్రమోషన్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పుడు వాటిని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది పరిణీతి. ‘పరిణీతి చోప్రా ప్రెగ్నెన్సీ రూమర్ అవాస్తవం. ఉద్యోగ రీత్యా వివిధ నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ఎలాంటి బట్టలు వేసుకోవాలో వారి ఇష్టం. ఇలా పుకార్లు పుట్టించడం సరికాదు’ అని పరిణీతి చోప్రా సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. కాగా పరిణీతి చోప్రా తన వ్యక్తిగత ఆలోచనలను పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడదు. రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా చాలా ఏళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.రాఘవ్, పరిణీతిల వివాహం గతేడాది సెప్టెంబర్ జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ వేదికగా వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

ఇవి కూడా చదవండి

విమానాశ్రయంలో పరిణీతి చోప్రా.. వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్