- Telugu News Photo Gallery Cinema photos Know where to watch Oscar Awards 2024 Winning movies on OTT platforms
Oscar Awards 2024: ఆస్కార్ అవార్డును గెల్చుకున్న సినిమాలు.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సారి కూడా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ ఈ సినిమా పండగకు వేదికగా మారింది. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డులు గెలిచిన చిత్రాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు సినిమా లవర్స్.
Updated on: Mar 11, 2024 | 2:13 PM

96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ సారి కూడా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ ఈ సినిమా పండగకు వేదికగా మారింది. ఇదిలా ఉంటే ఆస్కార్ అవార్డులు గెలిచిన చిత్రాలు.. ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు సినిమా లవర్స్.

ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడితో సహా మొత్తం ఏడు విభాగాల్లో ఓపెన్ హైమర్ సినిమా అవార్డులు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ తో చూడొచ్చు. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది.

ఓపెన్ హైమర్ తర్వాత ఎక్కవుగా అవార్డులు గెల్చుకున్న సినిమా పూర్ థింగ్స్.. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

ఆస్కార్ వేదికపై సత్తా చాటిన అమెరికన్ ఫిక్షన్, అనాటమీ ఆఫ్ ఎ ఫాల్, ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.

ఉత్తమ చిత్రం కేటగిరిలో ఓపెన్ హైమర్ తో పోటీ పడిన బార్బీ సినిమా ప్రస్తుతం జియో సినిమా యాప్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కొన్ని సినిమాలకు మాత్రమే తెలుగు వెర్షన్ ఉంది. అయితే అన్ని మూవీస్ కుఇ ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి కాబట్టి చూసేయవచ్చు.