Main Atal Hoon OTT: ఓటీటీలో వాజ్‌పేయి బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

భారత మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మై అటల్ హూ'. రవి జాదవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో వాజ్ పేయి పాత్రలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి కనిపించారు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన ఈ బయోపిక్ నవరి 19వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

Main Atal Hoon OTT: ఓటీటీలో వాజ్‌పేయి బయోపిక్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Main Atal Hoon Movie
Follow us

|

Updated on: Mar 11, 2024 | 1:09 PM

భారత మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మై అటల్ హూ’. రవి జాదవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో వాజ్ పేయి పాత్రలో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి కనిపించారు. పీయూశ్ మిశ్రా, రాజా రమేశ్‍కుమార్, దయాశంకర్ పాండే, ప్రమోద్ పాఠక్, పాయల్ నాయర్, రాజేశ్ ఖత్రి, ఎక్లాక్ ఖాన్, హర్షద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్ తో ఆసక్తిని రేకెత్తించిన ఈ బయోపిక్ నవరి 19వ తేదీన థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. ముఖ్యంగా వాజ్ పేయి పాత్రలో పంకజ్ త్రిపాఠి ఒదిగిపోయారు. ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. థియేటర్లలో ఆడియెన్స్ మెప్పు పొందిన మై అటల్ హూ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 వాజ్ పేయి బయోపిక్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 14వ తేదీన ఈ బయోపిక్ ను స్ట్రీమింగ్‍కు తీసుకురానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ.

‘అద్భుతమైన దార్శనికత, నిర్ణయాలతో దేశానికి సరి కొత్త దిశ, దశను నిర్దేశించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మై అటల్ హూ’ మార్చి 14న జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది” అని జీ5 ట్వీట్ చేసింది.భానుశాలి స్టూడియోస్ లిమిటెడ్, లెజెండ్ స్టూడియోస్ పతాకాలపై వినోద్ భానుశాలి, సందీప్ సింగ్, కమరేశ్ భానుశాలి సంయుక్తంగా మై అటల్ హూ సినిమాను నిర్మించారు పాయల్ దేవ్, కైలాశ్ ఖేర్, అమృత్ రాజ్, మొహంతీ శర్మ స్వరాలు సమకూర్చారు. ఓటీటీ కాబట్టి హిందీతో పాటు తెలుగు తదితర దక్షిణాది భాషల్లోనూ ఈ బయోపిక్ స్ట్రీమింగ్ కు రావొచ్చని సమాచారం.

ఇవి కూడా చదవండి

మై అటల్ హూ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ