Meera Chopra: ఘనంగా బంగారం సినిమా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి వేడుక.!

Meera Chopra: ఘనంగా బంగారం సినిమా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి వేడుక.!

Anil kumar poka

|

Updated on: Mar 14, 2024 | 4:40 PM

తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన సినీ నటి మీరా చోప్రా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఓ రిసార్టులో మంగళవారం ఆమె.. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను వివాహమాడారు. పెళ్లి ఫోటోలను మీరా చోప్రా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉంది. కొన్ని నెలల క్రితమే మీరా చోప్రా తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమైన సినీ నటి మీరా చోప్రా వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. రాజస్థాన్‌లోని ఓ రిసార్టులో మంగళవారం ఆమె.. వ్యాపారవేత్త రక్షిత్ కేజ్రీవాల్‌ను వివాహమాడారు. పెళ్లి ఫోటోలను మీరా చోప్రా ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉంది. కొన్ని నెలల క్రితమే మీరా చోప్రా తన ప్రేమ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది కానీ వరుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. తాము సంప్రదాయ హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆమె పేర్కొంది. ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు బంధువైన మీరా .. ఆమెను తన పెళ్లికి కచ్చితంగా ఆహ్వానిస్తానని కూడా చెప్పింది. వాళ్లు ఫ్రీగా ఉంటే వస్తారు అంటూ యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు బదులిచ్చింది. మీరా చోప్రా తండ్రి సురేశ్ చోప్రా, ప్రియాంక చోప్రా తండ్రికి కజిన్ అవుతారు.

పవన్ కల్యాణ్ సరసన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్‌గా మీరా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘వాన’, ‘మారో’, ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తమిళ సినిమాల్లోనూ మెరిసింది. మోడలింగ్‌తో తన కెరీర్ ప్రారంభించిన మీరా ఆ తరువాత దక్షిణాది నుంచి బాలీవుడ్‌ వైపు మళ్లింది. చివరిసారిగా ఆమె జీ5 ఫిలిమ్స్‌కు చెందిన సఫేద్ చిత్రంలో కనిపించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..