TOP9 ET: మహేష్‌ ఫ్యాన్స్‌తో పెట్టుకున్న విశ్వక్.! | ఎలక్షన్ బరిలో Pawan Kalyan కు పోటీగా RGV.

సినిమాల్లోనూ.. రియల్ లైఫ్‌లోనూ ఆల్మోస్ట్ ఓకే టోన్‌లో.. ఓకే టెంపోలో.. అదే యాటిట్యూడ్‌తో మాట్లాడే విశ్వక్‌ సేన్.. ఈ సారి సూపరర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పెట్టుకున్నాడు. నేరుగా కాకపోయినా.. ఇండైరెక్ట్‌గా.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు మీద ఈ స్టార్ హీరో కామెంట్స్ చేసి వాళ్లకు కోపం వచ్చేలా చేవాడు. ట్రోల్ అవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే! తన సినిమా 'గామి'ని ప్రమోట్ చేసే క్రమంలో..

TOP9 ET: మహేష్‌ ఫ్యాన్స్‌తో పెట్టుకున్న విశ్వక్.! | ఎలక్షన్ బరిలో Pawan Kalyan కు పోటీగా RGV.

|

Updated on: Mar 14, 2024 | 9:03 PM

01. బ్రేకింగ్ : మహేష్‌ ఫ్యాన్స్‌తో పెట్టుకున్న విశ్వక్

సినిమాల్లోనూ.. రియల్ లైఫ్‌లోనూ ఆల్మోస్ట్ ఓకే టోన్‌లో.. ఓకే టెంపోలో.. అదే యాటిట్యూడ్‌తో మాట్లాడే విశ్వక్‌ సేన్.. ఈ సారి సూపరర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పెట్టుకున్నాడు. నేరుగా కాకపోయినా.. ఇండైరెక్ట్‌గా.. సూపర్ స్టార్ మహేష్‌ బాబు మీద ఈ స్టార్ హీరో కామెంట్స్ చేసి వాళ్లకు కోపం వచ్చేలా చేవాడు. ట్రోల్ అవుతున్నాడు. అసలు విషయం ఏంటంటే! తన సినిమా ‘గామి’ని ప్రమోట్ చేసే క్రమంలో.. తన సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి మాట్లాడాలన్నారు. ఇది మన తెలుగు సినిమా కదా అంటూ.. గుర్తు చేశారు. అయితే విశ్వక్.. ఈ కామెంట్స్‌ మహేష్ అండ్ జక్కన్న ను దృష్టిలో పెట్టుకునే చేశారని అంటున్నారు అందరూ. వారిద్దరే రీసెంట్గా ప్రేమల మలయాళ డబ్బింగ్ మూవీ చూసి మెచ్చుకున్నారు.

02. rgv: ఎలక్షన్ బరిలో పవన్‌కు పోటీగా RGV

ఏపీ ఎలక్షన్స్‌లో పవన్‌ నిప్పు అయితే.. ఆర్జీవీ ఉప్పు అన్నట్టుగానే ఉంది ఎట్ ప్రజెంట్ పరిస్థితి. ఓ పక్క పవన్‌… ఏపీ ఎలక్షన్స్‌లో నెగ్గాలనే పంతంతో.. తన శాయశక్తులా కృషి చేస్తుంటే.. మరో పక్క అంతే ఆర్జీవీ.. అంతే పంతంతో.. తన స్టైల్లో పవన్‌ పై సెటైరికల్ ట్వీట్లు చేసుకుంటూ పోతున్నారు. ఇక తాజాగా కూడా అదే చేశారు. ఈ సారి ఏకంగా పిఠాపురంలో పవన్‌కు వ్యతిరేకగా పోటీ చేస్తున్నా అంటూ ఓ ట్వీట్ వదిలారు ఆర్జీవీ. ఇక ఈ ట్వీట్తో ఇప్పుడు నెట్టింట మరో సారి వైరల్ అవుతూనే.. ఏపీ రాజకీయ ముఖచిత్రంలో జోకర్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు జనసైనికుల నుంచి.

03. prabhas: ప్రభాస్‌తో లోకేష్‌ కనగరాజ్‌ సినిమా..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమా ట్రాక్‌ ఎక్కింది మొదలు.. ఆ ట్రాక్లో మాత్రమే కంటిన్యూ అవుతున్న ప్రభాస్‌.. ఇప్పుడు మరో క్రేజీ పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. విక్రమ్‌ సినిమాతో.. వన్‌ ఆఫ్ ది ప్రామిసింగ్‌ పాన్ ఇండియన్ మూవీ మేకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. ప్రభాస్‌తో తన నెక్ట్స్‌ సినిమా మొదలెట్టనున్నారట. ఈ సినిమా తన లోకి వర్స్‌లో భాగంగా.. బిగ్ బడ్జెట్‌తో.. వెరీ గ్రాండియర్ స్కేల్లో తెరకెక్కనుందట. త్వరలో అఫీషియల్ న్యూస్‌ కూడా.. వెరీ అఫీషియల్‌గా బయటికి రానుందట.

04.prabhas: ఇండియాలోనే ఏకైక హీరోగా ప్రభాస్‌ ప్రౌడ్ మూమెంట్..👏👏

నయా నయా పాన్ ఇండియా సినిమాలు.. బాక్సు బద్దలయ్యే కలెక్షన్లు.. లెక్కకు మించిన రికార్డులు.. అనేలా సాగుతున్న ప్రభాస్‌ ఫిల్మ్ కెరీర్‌లో మరో రికార్డ్‌ వచ్చి చేరింది. దేశంలో ఎంటర్‌టైన్‌ విభాగంలో టాప్ 10 మోస్ట్ యూజ్డ్‌ హ్యాష్‌ ట్యాగ్స్‌లో ప్రభాస్‌ పేరు 7వ స్థానంలో ఉందని రీసెంట్గా ట్విట్టర్ అనౌన్స్ చేసింది. అయితే ఈ లిస్టులో ఉన్న ఏకైక ఇండియన్ హీరో ప్రభాసే కావడం ఆయన క్రేజ్‌ ఏ రేంజో అందరికీ తెలిసేలా చేస్తోంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.

05. OTT ban: 18 OTT ప్లాట్‌ ఫామ్స్‌ బ్యాన్ కేంద్రం షాకింగ్ నిర్ణయం

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు కేంద్రం బిగ్ ఝలక్ ఇచ్చింది. తమ గైడ్‌ లైన్స్‌ కు అనుగుణంగా కంటెట్ స్ట్రీమీంగ్ చేయని దాదాపు 18 ప్లాట్ ఫామ్స్‌ను బ్యాన్‌ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ఇవ్వడం మానుకోవాలని పలు మార్లు హెచ్చరించినా మానని 18 ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌తో పాటు 19 వెబ్ సైట్లను కూడా బ్యాన్ చేసింది కేంద్ర ప్రభుత్వం.

06. rakul: పెళ్లి తర్వాత రూట్‌ మార్చిన రకుల్

హీరోయిన్లకు ఓ పద్దతి ఉంది. పెళ్లికి ముందు అడ్డు అదుపులేకుండా అందాలు ఆరబోసి.. పెళ్లి తర్వాత ఆ విషయంలో తగ్గడం ఓ అలవాటుగా ఉంది. అయితే హీరోయిన్లకుండే ఆ అలవాటును అసలు వంటపట్టించుకోని రకుల్.. తన రూటే సపరేట్ అన్నట్టు బిహేవ్‌ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా.. పెళ్లికి ముందు కంటే .. కాస్త ఎక్కువగా అందాలను ఆరబోస్తున్నారు. ఫోటో షూట్స్‌లలో.. రెచ్చిపోయి మరీ గ్లామర్‌ షో చేస్తున్నారు. సమ్మర్‌ హీట్ ను రెడింతలు చేస్తున్నారు.

07.venkatesh: వెంకీ ఇంట పెళ్లి సందడి

నిన్న కాక మొన్నే అభిరామ్ పెళ్లితో సందడిగా మారిన రామానాయుడు ఇంటి కాపౌండ్.. మరోసారి సందడిగా మారబోతోంది. విక్టరీ వెంకటేష్‌ చిన్నమ్మాయి హయవాహిని పెళ్లి వేడుకతో.. ఈ సందడి మొదలు కానుంది. ఇక గతేడాది విజయవాడకు చెందిన డాక్టర్‌తో వెంకీ చిన్నమ్మాయి హయవాహిని ఎంగేజ్‌మెంట్ అయింది. అయితే వీరి పెళ్లే మార్చ్‌ 15నే జరగనున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరి వివాహానికి రామానాయుడు స్టూడియో ముస్తాబవుతోంది.

08.varalaxmi: జైలుకు లేడీ విలన్? షాకింగ్ రియాక్షన్ !

డ్రగ్స్‌ కేసులు టాలీవుడ్‌ సెలబ్రిటీలనే కాదు. కోలీవుడ్‌ సెలబ్రిటీలను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. రీసెంట్‌గా నటి వరలక్ష్మి శరత్ కుమార్‌ కూగా డ్రగ్స్‌ కేసులోనే నోటీసులు అందుకుంది. ఈమె మేనేజర్ ఆదిలింగం భారీగా డ్రగ్‌ అండ్ ఇల్లీగల్ ఏకే47 వెపన్‌తో పట్టుబడడంతో.. అతనిపై కేస్ నమోదైంది. ఈ కేసులో భాగంగానే లేడీ విలన్‌ వరలక్ష్మికి కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే ఈ న్యూస్ బయటికి రావడంతో.. వరలక్ష్మి జైలుకు అంటూ న్యూసులు బయటికి వచ్చాయి. ఇక ఈ న్యూసులపై రీసెంట్గా రియాక్టయ్యారు ఈమె. మీడియాకు తాను తప్ప ఇంకెవరూ దొరకడం లేదా అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు.

09.muntaj: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన హాట్ బ్యూటీ

ఐంటెం సాంగ్స్‌లో అందాల ఆరబోతకు ఈమె ఓ బ్రాండ్ అంబాసిడర్. మత్తక్కించే కళ్లతో తాను చేసిన సినిమాలకు తెస్తుంటుంది.. ఓ స్పెషల్ అ్రటాక్షన్. ఆమె ముంతాజ్‌. ఖుషీ సినిమాలోని గజ్జె గల్లు మన్నాది రో.. సాంగ్‌తో ఓవర్‌ నైట్ క్రేజ్ సంపాదించున్న ఈ బ్యూటీ.. గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. తన హిజాబ్‌ ధరించి చాలా ట్రెడీషనల్‌గా కనిపించారు. తన మారిపోయిన పద్దతితో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తూనే నెట్టింట వైరల్ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
మీరు ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని తెలుసా?
మీరు ధరించే దుస్తులు కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతాయని తెలుసా?
నా కల నెరవేరింది.. నటి సోనాక్షి సిన్హా.| శ్రుతి హాసన్‌ బ్రేకప్.?
నా కల నెరవేరింది.. నటి సోనాక్షి సిన్హా.| శ్రుతి హాసన్‌ బ్రేకప్.?
సీతారాములుగా ఆ ఇద్దరూ ఎంత అందంగా ఉన్నారో..
సీతారాములుగా ఆ ఇద్దరూ ఎంత అందంగా ఉన్నారో..
విరాళాలు సేకరించి కిట్‌లు కొనుగోలు.. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం..
విరాళాలు సేకరించి కిట్‌లు కొనుగోలు.. తొలి మ్యాచ్‌లోనే ఘన విజయం..
ఈ చిన్న అమ్మాయ్.. ఇప్పుడు పెద్ద హీరోయిన్ గుర్తుపట్టారా..?
ఈ చిన్న అమ్మాయ్.. ఇప్పుడు పెద్ద హీరోయిన్ గుర్తుపట్టారా..?
ఒక్కసారి ఛార్జింగ్‌తో 323 కిలోమీటర్లు.. వేగవంతమైన ఎలక్ట్రిక్‌ బైక
ఒక్కసారి ఛార్జింగ్‌తో 323 కిలోమీటర్లు.. వేగవంతమైన ఎలక్ట్రిక్‌ బైక
పవర్‌స్టార్‌ టు కింగ్‌.. ఖాకీలో కనిపించబోయేది ఎవరు.?
పవర్‌స్టార్‌ టు కింగ్‌.. ఖాకీలో కనిపించబోయేది ఎవరు.?
చిన్న పొరపాటుతో రూ. 20లక్షలకు కొన్నారు.. కట్‌చేస్తే..
చిన్న పొరపాటుతో రూ. 20లక్షలకు కొన్నారు.. కట్‌చేస్తే..
అలెగ్జాండర్ కూల్చిన కాశ్మీర్‌లోని ఆలయం.. 524 ఏళ్లకు పునర్నిర్మాణం
అలెగ్జాండర్ కూల్చిన కాశ్మీర్‌లోని ఆలయం.. 524 ఏళ్లకు పునర్నిర్మాణం
ఆ నియోజకవర్గం మినహా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు!
ఆ నియోజకవర్గం మినహా 16 స్థానాల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతు!