Upasana Konidela: అయోధ్య బాల రామయ్యను దర్శించుకున్న ఉపాసన.. తాతయ్యతో  కలిసి ప్రత్యేక పూజలు.. వీడియో

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. భర్త తో కలిసి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె ఇప్పుడు మాత్రం తన తాత, నాయనమ్మలతో కలిసి బాల రాముడిని దర్శించుకున్నారు.

Upasana Konidela: అయోధ్య బాల రామయ్యను దర్శించుకున్న ఉపాసన.. తాతయ్యతో  కలిసి ప్రత్యేక పూజలు.. వీడియో
Upasana Family
Follow us

|

Updated on: Mar 13, 2024 | 2:06 PM

మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన అయోధ్య బాల రాముడిని దర్శించుకున్నారు. భర్త తో కలిసి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆమె ఇప్పుడు మాత్రం తన తాత, నాయనమ్మలతో కలిసి బాల రాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఫౌండర్ ప్రతాప్ సీ రెడ్డి, నాయనమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాల రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే అయోధ్య రామ మందిరంలో గత 48 రోజులుగా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రామరాగ్ సేవ ఈ నెల 10వ తేదీన ముగిసింది. ఈ రామరాగ్ సేవ ముగింపు సందర్భంగా ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్లింది. బాలరాముని సేవలో తరించింది. తాజాగా వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ‘నా కోరిక తీరింది, ఒక కల నెరవేరిందని.. ఇదొక అద్భుతమైన.. దివ్యమైన అనుభూతి. నా జీవితంలో మరిచిపోలేని ప్రయాణంలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. తెల్లవారుజూమున 4 గంటలకు స్వామివారిని దర్శించుకున్నాం’ అని సోషల్ మీడియాలో పోస్టులో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో ఆలయ పరిసరాల్లో ఉపాసన, ఆమె తాత , అపోలో ప్రతాప్ సీ రెడ్డి, నాయనమ్మలను కూడా చూడొచ్చు. అంతకుముందు ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ ను ప్రత్యేకంగా కలిసింది ఉపాసన. అయోధ్యలోనూ అపోలో ఆస్పత్రి సేవలను విస్తరించాలని కోరారు. ఇక్కడి భక్తులకు ఉచితంగా అత్యవసర సేవలను అందిస్తామంటూ తెలిపారు. ఈ సందర్భంగా తన తాత, అపోలో ఆస్పత్రి వ్యవస్థాపకులు అపోలో ప్రతాప్ సీ రెడ్డి విజయాల గురించి వివరించే “ది అపోలో స్టోరీ” అనే పుస్తకాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బహూకరించారు ఉపాసన. వీటికి సంబంధింధించిన ఫొటోలు కూడా ప్రస్తుతం సామాజి కమాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

 అయోధ్య రామ మందిరంలో మెగా కోడలు..

యూపీ సీఎం యోగితో ఉపాసన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.