- Telugu News Photo Gallery Cinema photos Anupama Parameswaran New Telugu Movie Title is Parada telugu movie news
Anupama Parameswaran: అనుపమ కొత్త సినిమా టైటిల్ ఇదే.. అసలు ఊహించనేలేదే.. హీరో ఎవరంటే..
అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు రూటు మార్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ట్రెడిషనల్ బ్యూటీగా కనిపించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు గ్లామర్ హద్దులు చెరిపేసింది. రౌడీ బాయ్స్ సినిమాతో అభిమానులకు షాకిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులోనూ దూసుకుపోతుంది. ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ సరసన టిల్లు స్వ్కేర్ సినిమాలో నటిస్తుంది. ఇందులో పూర్తిగా గ్లామరస్ హీరోయిన్గా కనిపించనుంది.
Updated on: Mar 13, 2024 | 1:37 PM

అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు రూటు మార్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ట్రెడిషనల్ బ్యూటీగా కనిపించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు గ్లామర్ హద్దులు చెరిపేసింది. రౌడీ బాయ్స్ సినిమాతో అభిమానులకు షాకిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులోనూ దూసుకుపోతుంది.

ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ సరసన టిల్లు స్వ్కేర్ సినిమాలో నటిస్తుంది. ఇందులో పూర్తిగా గ్లామరస్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ చూసి అవాక్కయ్యారు ఫ్యాన్స్. అసలు తమ హీరోయిన్ కు ఏమైంది ?.. ఎందుకు ఇలా చేస్తుందంటూ ? నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తమిళంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ మారి సెల్వరాజ్ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో విక్రమ్ చియాన్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. అలాగే తెలుగులో అనుపమ చేస్తున్న మరో ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగులతో అనుపమ ఓ సినిమా చేయనున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే ఈ సినిమాకు పరదా అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది.

ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమతోపాటు సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్ కీలకపాత్రలు పోషించారు. ఇదే కాకుండా తెలుగులో ఈ బ్యూటీకి ఇప్పుడు మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.




