- Telugu News Photo Gallery Cinema photos Hero Allari Naresh faria abdullah movie aa okkati adakku Movie teaser Update details Telugu Heroes Photos
aa okkati adakku: మళ్లీ కామెడీ వైపు అల్లరి నరేష్ అడుగులు.! ఆ ఒక్కటి అడక్కు.
అల్లరి నరేష్ మళ్లీ కామెడీ వైపు అడుగులు వేసారు బాగానే ఉంది. కానీ ఇది ఆయనకు సేఫ్ జోనేనా లేదంటే డేంజర్ జోన్‌లోకి ఎంటర్ అవుతున్నారా..? అదేంటి అలా అంటున్నారు.. నరేష్‌కు కామెడీ బలమే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నరేష్ మళ్లీ అల్లరి మొదలు పెట్టినా.. తెలియని ప్రమాదం పొంచే ఉంది. మరి అదేంటి..? అల్లరి నరేష్‌ను ఇలా సీరియస్‌గా చూడటం కంటే.. కామెడీ రోల్స్‌లో చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్.
Updated on: Mar 13, 2024 | 7:07 PM

అల్లరి నరేష్ మళ్లీ కామెడీ వైపు అడుగులు వేసారు బాగానే ఉంది. కానీ ఇది ఆయనకు సేఫ్ జోనేనా లేదంటే డేంజర్ జోన్‌లోకి ఎంటర్ అవుతున్నారా..? అదేంటి అలా అంటున్నారు.. నరేష్‌కు కామెడీ బలమే కదా అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.

నరేష్ మళ్లీ అల్లరి మొదలు పెట్టినా.. తెలియని ప్రమాదం పొంచే ఉంది. మరి అదేంటి..? అల్లరి నరేష్‌ను ఇలా సీరియస్‌గా చూడటం కంటే.. కామెడీ రోల్స్‌లో చూడ్డానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు ఆడియన్స్.

ఆయన సీరియస్ రోల్స్ ఇరగదీస్తారు.. అందులో అనుమానం లేదు కానీ నరేష్‌లో ఉండే నవ్వుల్ని ఈ మధ్య బాగా మిస్ అయ్యారు ఫ్యాన్స్. అందుకే కొన్నాళ్లు సీరియస్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. పాత నరేష్‌ను బయటికి తెస్తున్నారు.

రెండేళ్ల కింద నాందీతో సీరియస్ టర్న్ తీసుకున్న నరేష్.. తర్వాత మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో వచ్చారు. ఇక నా సామిరంగాలోనూ నవ్విస్తూనే.. ఏడిపించారు నరేష్. ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చల మల్లి..

తాజాగా అంకం మల్లి దర్శకత్వంలో ఆ ఒక్కటి అడక్కు సినిమా చేస్తున్నారు నరేష్. దీని టీజర్ విడుదలైందిప్పుడు. పెళ్లి కాన్సెప్ట్‌తో వస్తుంది ఆ ఒక్కటి అడక్కు.

అంతా బానే ఉంది కానీ సుడిగాడు తర్వాత పదేళ్లు నరేష్‌కు హిట్టే లేదు. చివరికి తన కామెడీ బోర్ కొట్టిందేమో అని.. నాందీతో రూట్ మార్చారు. మళ్లీ ఇప్పుడు అల్లరోడు బయటికి వస్తున్నారు.

మరి ఈసారి కామెడీ బోర్ కొట్టకుండా కేర్ తీసుకున్నారా..? ఆ ఒక్కటి అడక్కు హిట్టైతే.. నరేష్ మళ్లీ హాయిగా కామెడీ సినిమాలే చేసుకోవచ్చు లేదంటే మాత్రం ఆలోచించుకోవాల్సిందే.




