Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ అనుకున్న తేదీకే రిలీజవుతుందా? అసలు విషయం చెప్పేసిన బిగ్ బీ అమితాబ్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'కల్కి 2898 AD' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ అందాల తార దిశా పటానీ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది

Kalki 2898 AD: ప్రభాస్ 'కల్కి' అనుకున్న తేదీకే రిలీజవుతుందా? అసలు విషయం చెప్పేసిన బిగ్ బీ అమితాబ్
Amitabh Bachchan, Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Mar 14, 2024 | 2:07 PM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ‘కల్కి 2898 AD’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రభాస్‌ సరసన దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ అందాల తార దిశా పటానీ స్పెషల్ సాంగ్ లో సందడి చేయనుంది. మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి అశ్విని దత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కల్కి సినిమా మే 9 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ఇది వరకే చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఈ తేదీకి ప్రభాస్ సినిమా రిలీజ్ కావడం లేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కల్కి సినిమా షూటింగ్ గురించి, అలాగే మూవీ రిలీజ్ డేట్ పై అమితాబ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ వయసు 81. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజిబిజీగా ఉంటున్నాడు. ఇక ప్రభాస్ ‘కల్కి 2898 AD’ కోసం భారీ కాల్షీట్ ఇచ్చారు బిగ్ బీ. ఇప్పుడీ ది మోస్ట్ అవైటెడ్ మూవీ షూటింగ్ పూర్తయిందని తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు బిగ్ బీ.

‘నిన్న రాత్రి షూటింగ్‌ ముగించుకుని వచ్చాను. కల్కి షూటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ముందుగా చెప్పినట్లుగా మే 9న సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి’ అని అమితాబ్ తెలిపారు. ఇది విన్న ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. సినిమా రిలీజ్ కోసం వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘కల్కి క్రీ.శ. 2898’లో మహాభారతం నుంచి కథ ప్రారంభమవుతుంది. 6000 వేల సంవత్సరాల కాలంలో కథ సాగుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ‘కల్కి 2898 AD’ మే 9న విడుదల చేయడానికి మరో ప్రత్యేక కారణం కూడా ఉంది. ఆరోజు వైజయంతీ మూవీస్ వ్యవస్థాపక దినోత్సవం. గతంలో అశ్విని దత్ నిర్మించిన చాలా సినిమాలు మే 9న విడుదలై సూపర్ హిట్ గా నిలిచాయి. అందుకే మే 9నే కల్కి ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని బల్లగుద్ది చెబుతున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.