AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Shankar: ‘మీ మీద గౌరవం పెరిగింది సార్’.. హరీశ్ శంకర్‌ మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు హరీశ శంకర్. తన సినిమా అప్డేట్స్ తో పాటు సామాజిక అంశాలపై తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా మాట్లాడే హరీశ్ శంకర్ ఇతరులకు తన వంతు సాయం చేస్తుంటాడు. ఇప్పుడు మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడీ స్టార్ డైరెక్టర్.

Harish Shankar: 'మీ మీద గౌరవం పెరిగింది సార్'.. హరీశ్ శంకర్‌ మంచి మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వీడియో
Harish Shankar
Basha Shek
|

Updated on: Mar 14, 2024 | 12:33 PM

Share

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన హరీశ్ శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా మాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ముఖ్యంగా పంచ్ డైలాగులకు హరీశ్ పెట్టింది పేరు. పవన్ కల్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తీసిన ఆయన ప్రస్తుతం అదే పవర్ స్టార్ తో ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమాను తీస్తున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటారు హరీశ శంకర్. తన సినిమా అప్డేట్స్ తో పాటు సామాజిక అంశాలపై తన దైన శైలిలో స్పందిస్తుంటారు. ఏ విషయమైనా నిర్మోహమాటంగా మాట్లాడే హరీశ్ శంకర్ ఇతరులకు తన వంతు సాయం చేస్తుంటాడు. ఇప్పుడు మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడీ స్టార్ డైరెక్టర్. హైదరాబాద్‌ నగరంలో నడి రోడ్డుపై నిలిచిపోయిన ఒక కారు విషయంలో డైరెక్టర్ హరీశ్ శంకర్‌ సాయం అందించారు. నడిరోడ్డుపై ఆగిపోయిన కారును హరీశ్‌తో పాటు మైత్రి మేకర్స్‌ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్‌, అలాగే ఉప్పెన డైరెక్టర్ సనా బుచ్చిబాబు కలిసి కొంత దూరం పాటు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లారు. దీనిని గమనించిన మరికొందరు హరీశ్, రవిశంకర్ లకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. హరీశ్, రవిశంకర్ ల మంచి మనసుకు అభిమానుల, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టార్ సెలబ్రిటీలైనా సింప్లిసిటీ చాటుకున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

పవన్ కల్యాణ్ ఉస్తాద్ కన్నా ముందు రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు హరీశ్ శంకర్‌. ఇందులో కొత్తమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో రవితేజ, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో షాక్, మిరపకాయ్ వంటి హిట్ సినిమాలు వచ్చాయి. మిస్టర్ బచ్చన్ హ్యాట్రిక్ కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

రోడ్డుపై ఆగిన కారుకు సాయమందిస్తోన్న డైరెక్టర్ హరీశ్ శంకర్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.