Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

ప్రేమలు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ  సినిమా పేరే బాగా వినిపిస్తోంది. మలయాళంలో ఒక చిన్న సినిమాగా రిలీజై ఏకంగా వంద కోట్లు రాబట్టిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగులోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి యువత బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ప్రేమలు సినిమా అంచనాలకు మించి వసూళ్లను సాధిస్తోంది

Premalu OTT: ప్రేమలు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. తెలుగుతో సహా అన్ని భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Premalu Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 14, 2024 | 1:28 PM

ప్రేమలు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ  సినిమా పేరే బాగా వినిపిస్తోంది. మలయాళంలో ఒక చిన్న సినిమాగా రిలీజై ఏకంగా వంద కోట్లు రాబట్టిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇప్పుడు తెలుగులోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. హైదరాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి యువత బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ప్రేమలు సినిమా అంచనాలకు మించి వసూళ్లను సాధిస్తోంది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. గిరీష్ ఏడీ తెరకెక్కించిన ప్రేమలు సినిమాలో స్లీన్‌, మ‌మితా బైజు హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ మూవీ ఏకంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టింది. అన్నట్లు ఈ మూవీ బడ్జెట్ ఎతో తెలుసా? జస్ట్.. కేవలం 10 కోట్లు మాత్రమే. మలయాళ ప్రేక్షకుల మెప్పు పొందిన ప్రేమలు తెలుగులో మాత్రం ఒక నెల ఆలస్యంగా మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. ఇక్కడ డైరెక్టర్ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ ఈ సినిమాను రిలీజ్ చేయడం విశేషం. ప్రస్తుతం థియేటర్లలో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది ప్రేమలు సినిమా. ఇందులో నటించిన హీరోయిన్ మమితా బైజు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇలా ఎన్నో విశేషాలున్న ప్రేమలు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేమలు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 29 నుంచి ఈ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ లవ్ స్టోరీని ఓటీటీలో స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప్రేమ‌లు స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. మొదట ప్రేమలు సినిమాను మార్చి మొదటి వారంలోనే ఓటీటీలోకి తీసుకురావాలని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాన్ చేసిందట. అయితే తెలుగు వెర్షన్ థియేటర్లలో మార్చి 8న రిలీజ్ కావడంతో స్ట్రీమింగ్ డేట్ వాయిదా పడినట్లు సమాచారం. ప్రేమ‌లు సినిమాలో శ్యామ్ మోహ‌న్ సంగీత్ ప్ర‌తాప్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం