Em Chesthunnav OTT: ఓటీటీలో రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘ఏం చేస్తున్నావ్’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ ను ఆకట్టుకోని సినిమాలు కూడా ఒక్కోసారి ఓటీటీలో హిట్ అవుతుంటాయి. మంచి వ్యూస్ సొంతం చేసుకుంటాయి. అలా గతేడాది థియేటర్లలో విడుదలై పెద్దగా మెప్పించని ఒక యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది.

Em Chesthunnav OTT: ఓటీటీలో రొమాంటిక్ లవ్ స్టోరీ.. 'ఏం చేస్తున్నావ్' స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Em Chesthunnav Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 14, 2024 | 11:36 AM

థియేటర్లలో విడుదలై ఆడియెన్స్ ను ఆకట్టుకోని సినిమాలు కూడా ఒక్కోసారి ఓటీటీలో హిట్ అవుతుంటాయి. మంచి వ్యూస్ సొంతం చేసుకుంటాయి. అలా గతేడాది థియేటర్లలో విడుదలై పెద్దగా మెప్పించని ఒక యూత్ ఫుల్ ప్రేమ కథా చిత్రం ఓటీటీలో సందడి చేయనుంది. అదే ఏం చేస్తున్నావ్‌. భరత్ మిత్ర తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో దాదాపు అందరూ కొత్త వాళ్లే నటించారు. విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటానీ హీరో హీరోయిన్లుగా నటించారు. అమిత రంగనాథ్, ఆమని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది ఆగస్టు 25న థియేటర్లలో రిలీజైన ఏం చేస్తున్నావ్ పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రమోషన్లు సరిగా నిర్వహించకపోవడంతో అసలీ సినిమా వచ్చిందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఇప్పుడీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 28 నుంచి ఏం చేస్తున్నావ్ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. ‘ఒక ప్రశ్న.. మరెన్నో సమాధానాలు.. యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏం చేస్తున్నావ్ మార్చి 28 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది’ అని ట్వీట్ చేసింది ఈటీవీ విన్.

నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా ఏం చేస్తున్నావ్ సినిమాను నిర్మించారు. గోపి సుందర్ స్వరాలు సమకూర్చారు. ప్రేమ్ అడివి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే హరీష్ శంకర్ టి ఎన్ ఎడిటర్ గా వ్యవహరించారు. కాగా మొదట ఈ సినిమాను గురువారం అంటే ఇవాళ్టి (మార్చి 14) నుంచే ఓటీటీలోకి తీసుకురానున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా రెండు వారాలు వాయిదా పడింది. ఇదే విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఈటీవీ విన్ ఓటీటీ సంస్థ.

ఇవి కూడా చదవండి

మార్చి 28 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

ఈటీవీ విన్ లో భయ పెడుతోన్న వళరి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.