OTT Platforms Ban: హద్దుదాటిన ఎంటర్టైన్మెంట్.. 18 ఓటీటీలు బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం
చాలా రకాల టాక్ షోలు, గేమ్ షోలతోపాటు.. అదిరిపోయే వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీల్లో వచ్చే కంటెంట్ కు సెన్సార్ లేకపోవడంతో అశ్లీలత ఎక్కువైంది.. బూతులు, బోల్డ్ కంటే.. శృతిమించిన హింస ఇలా నానా రచ్చ జరుగుతోంది. దాంతో పలు ఓటీటీ సంస్థల పై కేంద్రం సీరియస్ అయ్యింది. అసభ్య కంటెంట్, బోల్డ్ కంటెంట్ ఉన్న 18 ఓటీటీలపై నిషేధం విధించింది కేంద్రం.

ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ డబుల్ అయ్యింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోనూ రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక చాలా రకాల టాక్ షోలు, గేమ్ షోలతోపాటు.. అదిరిపోయే వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీల్లో వచ్చే కంటెంట్ కు సెన్సార్ లేకపోవడంతో అశ్లీలత ఎక్కువైంది.. బూతులు, బోల్డ్ కంటే.. శృతిమించిన హింస ఇలా నానా రచ్చ జరుగుతోంది. దాంతో పలు ఓటీటీ సంస్థల పై కేంద్రం సీరియస్ అయ్యింది. అసభ్య కంటెంట్, బోల్డ్ కంటెంట్ ఉన్న 18 ఓటీటీలపై నిషేధం విధించింది కేంద్రం. అశ్లీలతను ప్రమోట్ చేస్తున్నారంటూ కేంద్రం సీరియస్ అయ్యింది. అశ్లీలతను తొలగించాలని, బోల్డ్ కంటెంట్ ను తగ్గించాలని గతంలోనే పలు సార్లు హెచ్చరించిన ఆ ఓటీటీలు లెక్కచేయలేదు.
హెచ్చరించిన పట్టించుకోని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా వేదికలను బ్లాక్ చేస్తున్నట్టు కేంద్రం తెలిపింది. అసభ్యతను ప్రమోట్ చేస్తున్న ఓటీటీలను బ్యాన్ చేయాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 12న ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. 10 యాప్స్‌ని వెంటనే బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది. వీటిలో 7 ప్లే స్టోర్ లో ఉండగా.. 7 యాప్‌స్టోర్‌లో ఉన్నాయి. వీటిని వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశించింది కేంద్రం.
ఇక బ్లాక్ చేసిన ఓటీటీల్లో డ్రీమ్స్ ఫిల్మ్స్, వూవీ, యస్మా, అన్‌కట్ అడ్డా, ట్రై ఫ్లిక్స్, ఎక్స్ ప్రైమ్, హంటర్, ర్యాబిట్, హంటర్, ఎక్స్‌ట్రా మూడ్, న్యూఫ్లిక్స్, బేషారమ్స్, నియోన్ ఎక్స్ వీఐపీ, మూడ్ ఎక్స్, మోజ్‌ఫ్లిక్స్, హాట్ షాట్ వీఐపీ, ఫ్యూగీ, చికోఫ్లిక్స్, ప్రైమ్ ప్లే ఉన్నాయి. వీటిలో అశ్లీలత ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారని కేంద్రం మండిపడింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 ప్రకారం ఈ ఆదేశాలు జరీ చేసినట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




