Hanu Man OTT : హనుమాన్ తెలుగు వర్షెన్ ఓటీటీ అప్డేట్.. క్లారీటీ ఇచ్చిన సంస్థ..స్ట్రీమింగ్ ఇందులో అంటే
హనుమంతుడి బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. 300కోట్లకు పైగా వసూల్ చేసి ఈ సినిమా రికార్డ్ సెట్ చేసింది. బడా సినిమాలకు పోటీగా వచ్చిన హనుమాన్ సినిమా ఆ సినిమాలను బీట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన ;సినిమాలని ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన సినిమాలో హనుమాన్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంది. ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్ తో తెరకెక్కింది. హనుమంతుడి బ్యాక్డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. 300కోట్లకు పైగా వసూల్ చేసి ఈ సినిమా రికార్డ్ సెట్ చేసింది. బడా సినిమాలకు పోటీగా వచ్చిన హనుమాన్ సినిమా ఆ సినిమాలను బీట్ చేసి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలని ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. కానీ హనుమాన్ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు.
హనుమాన్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో హనుమాన్ ఓటీటీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను హిందీలోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ముంబైకి చేరుకున్నారు మూవీ టీమ్. ఇక హనుమాన్ సినిమా ఓటీటీకంటే ముందు టీవీలో టెలికాస్ట్ కానుంది.
ఈ శనివారం రాత్రి 8 గంటలకు హనుమాన్ హిందీ వెర్షన్ కలర్స్ సినీప్లెక్స్ లో టెలికాస్ట్ కానుంది. ఇక ఓటీటీలోకి అదే రోజునుంచి స్ట్రీమింగ్ కానుంది. హనుమాన్ హిందీ వెర్షన్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. ఇదిలా ఉంటే హనుమాన్ సినిమా తెలుగు వర్షన్ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా హనుమాన్ తెలుగు వర్షన్ పై ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను త్వరలోనే స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలిపింది జీ 5. ఈ మేరకు ఓ ట్వీట్ షేర్ చేసింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 300కోట్ల వరకు వసూల్ చేసింది.
Your wait finally comes to an end!
Hold on to the excitement for the ultimate super-hero spectacle of the year! 🙏🎬
HanuMan, coming soon on ZEE5#ZEE5Global #JaiShreeHanuman #HanuManComingSoonOnZEE5 #HanuManOnZee5 #ComingSoon #ZEE5 @PrasanthVarma @Niran_Reddy @Actor_Amritha… pic.twitter.com/wrgv9wNECS
— ZEE5 Global (@ZEE5Global) March 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




