AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: ప్రాణం పోయిన ఇచ్చిన మాట తప్పను.. రైతు కుటుంబానికి సాయం అందించిన ప్రశాంత్

సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మధ్యలో పక్క ట్రాక్ లోకి వెళ్లినా చివరిలో బాగా ఆడి విన్నర్ గా నిలిచాడు. అయితే తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ 35 లక్షలతో రైతులకు సాయం చేస్తానని ముందే చెప్పాడు ప్రశాంత్. అయితే బిగ్ బాస్ పూర్తయ్యి మూడు నెలలు కావస్తున్నా దాని పై ఇంతవరకు ఎలాంటి ఊసు లేదు.

Pallavi Prashanth: ప్రాణం పోయిన ఇచ్చిన మాట తప్పను.. రైతు కుటుంబానికి సాయం అందించిన ప్రశాంత్
Pallavi Prashanth
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2024 | 8:21 AM

Share

బిగ్ బాస్ సీజన్ 7 ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ గేమ్ షో ఇటీవలే సీజన్ 7 ను పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. సామాన్యుడిగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తనదైన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మధ్యలో పక్క ట్రాక్ లోకి వెళ్లినా చివరిలో బాగా ఆడి విన్నర్ గా నిలిచాడు. అయితే తాను గెలుచుకున్న ప్రైజ్ మనీ 35 లక్షలతో రైతులకు సాయం చేస్తానని ముందే చెప్పాడు ప్రశాంత్. అయితే బిగ్ బాస్ పూర్తయ్యి మూడు నెలలు కావస్తున్నా దాని పై ఇంతవరకు ఎలాంటి ఊసు లేదు. దాంతో పల్లవి ప్రశాంత్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రశాంత్ ను చాలా మంది ట్రోల్ చేశారు.

ఇచ్చిన మాట మర్చిపోయి షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడంటూ విమర్శలు చేశారు. మొత్తానికి ఇప్పటికి పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. రైతులకు తాను అందిస్తానన్న సాయం అందించాడు. బిగ్ బాస్ పుణ్యమా అని పల్లవేసి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. గత ఆరు సీజన్స్ కు జరగనంత రచ్చ సీజన్ 7లో జరిగింది. బిగ్ బాస్ 7 ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో బయట అభిమానులు చేసిన హంగామా కలకలం రేపింది.

పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ కొంతమంది కార్లపై, బస్సుల పై దాడి చేశారు. ప్రశాంత్ కూడా పోలీసులు చెప్పిన మాట వినకపోవడమతొ అతన్ని అరెస్ట్ చేశారు. ఆతర్వాత పల్లవి ప్రశాంత్ బెయిల్ పై బయటకు వచ్చాడు. తాజాగా ప్రశాంత్ గజ్వేల్‪‌లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి సాయం అందించాడు. తల్లిదండ్రులను పోగొట్టుకున్న  ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ తో పాటు సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం అందించాడు.

పల్లవి ప్రశాంత్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!