- Telugu News Photo Gallery Cinema photos Actress Faria Abdullah going to marriage a short film hero says reports
Faria Abdullah: పెళ్లిపీటలెక్కనున్న చిట్టీ!! హైదరాబాదీ బ్యూటీతో ఏడడుగులు నడిచేది ఎవరంటే?
జాతిరత్నాలు సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన చిట్టీ అదే నండి మన ఫరియా అబ్దుల్లా పెళ్లికి రెడీ అయిపోతుందా? బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేసి త్వరలోనే తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Updated on: Mar 15, 2024 | 3:21 PM

జాతిరత్నాలు సినిమాతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన చిట్టీ అదే నండి మన ఫరియా అబ్దుల్లా పెళ్లికి రెడీ అయిపోతుందా? బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేసి త్వరలోనే తన చిన్ననాటి స్నేహితుడితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ పేరు తెచ్చుకుంది హైదరాబాద్ కు చెందిన ఫరియా అబ్దుల్లా. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది.

ఇదిలా ఉంటే ఫరియా అబ్దుల్లా త్వరలోనే పెళ్లి చేసుకోనుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు ఫరియా రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే చిట్టీకి కాబోయే వరుడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడేనట. ప్రస్తుతం షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా నటిస్తున్నాడట.

ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫరియా పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై చిట్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.